Urmila Devi : ఆయన వల్లే 14 యేళ్ళ పాటు ఏకధాటిగా నిద్రపోయిన ఊర్మిళాదేవి.. అసలు విషయం ఏమిటంటే..?

Urmila Devi : శ్రీమహావిష్ణువు ఒక్కో జన్మలో ఒక్కో అవతారం ఎత్తి .. లోక కల్యాణం కోసం పాటుపడ్డ విషయం తెలిసిందే. అయితే అందులో రామాయణం కు చాలా ప్రత్యేకత ఉంది. స్త్రీ కోసం ప్రత్యేకంగా యుద్ధం జరిగింది. అందుకే రామాయణంలో స్త్రీ కి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే రామాయణంలో జనక మహా రాజు కూతురు అయిన సీతాదేవినీ స్వయంవరంలో శివధనస్సు ఎక్కుపెట్టి.. సీతాదేవిని శ్రీరాముడు పరిణయమాడిన విషయం అందరికీ తెలిసిందే. సీత చెల్లెలు ఊర్మిళాదేవి ని రాముడి తమ్ముడైన లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయడం కూడా మనకు తెలిసిందే. పెళ్లి అయిన కొద్ది రోజులకే భరతుడికి పట్టాభిషేకం చేయాలన్న ఆలోచనతో కైకేయి దశరథుడిని కోరిక కోరుతుంది .

ఇక తన కోరికను తీర్చ లేక.. ఇచ్చిన మాట తప్ప లేక దశరథ మహారాజు శ్రీ రాముల వారిని వనవాసం చేయాలని ఆజ్ఞాపిస్తాడు.తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళ్తాడు . ఇక భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని సీతాదేవి కూడా అరణ్యవాసం వెళ్లడానికి బయల్దేరుతుంది. ఇక అన్న , వదినల రక్షణ కోసం లక్ష్మణుడు కూడా అరణ్యవాసం చేయడానికి వారి వెంట బయలుదేరుతారు. అప్పుడు ఊర్మిలాదేవి కూడా తనతో పాటు వస్తాను అని చెప్పగా.. అందుకు లక్ష్మణుడు ఇక్కడే ఉండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరుతాడు. ఇక లక్ష్మణుడు వచ్చే వరకు ఎవరిని చూడనని నిద్రలోకి జారుకుంటుంది ఊర్మిళాదేవి. అలా ఏకంగా 14 సంవత్సరాల పాటు ఏకధాటిగా నిద్రలోనే జీవితాన్ని గడుపుతుంది.

Urmila Devi, who slept with him for 14 years
Urmila Devi, who slept with him for 14 years

ఇక అరణ్యవాసంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడం తో తన బాధ్యత కు ఎలాంటి ఆటంకం కలగకుండా తనకు పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్ర రాకుండా విడిచిపెట్టమని నిద్రాదేవతని వేడుకుంటాడు లక్ష్మణుడు. నిద్రాదేవి.. నిద్ర అనేది ప్రకృతి ధర్మం అని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో అలా 14 సంవత్సరాల పాటు తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు కోరతాడు.ఇక అలా వనవాసం నుంచి తిరిగి వచ్చే వరకు ఊర్మిలా నిద్రలోనే ఉండిపోతుంది. ఇక వాళ్లు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు ఆమెకు మెలకువ వస్తుంది.అందుకే రామాయణంలో ఊర్మిళాదేవి నిద్రకి కూడా ఒక కీలక అంశం. ఇక అలా అన్న మాట తప్పని తమ్ముడిగా.. భర్తల మాట జవదాటని భార్య లుగా రామాయణ కథకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడం గమనార్హం.