Beauty Tips : పాదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి..!!

Beauty Tips : అందం అనేది కేవలం ముఖానికి సంబంధించింది మాత్రమే కాదు.. చేతులు.. పాదాలకు కూడా.. ముఖ్యంగా చర్మానికి అవసరమైన జాగ్రత్తలు పాటించినట్లయితే ముఖంతోపాటు చేతులు , పాదాలు కూడా మృదువుగా మారుతాయి. ఇకపోతే చర్మానికి అవసరమైన నూనెలు అలాగే మాయిశ్చరైజర్ లలో పెరుగు కూడా ఒకటి. ట్యాన్ అయిన పాదాలకు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఇంటి చిట్కా కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు పార్లర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేయకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు మృదువైన , అందమైన పాదాలు మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా ఒక గిన్నెలో ఒక టేబుల్ సముద్రపు పిండి తీసుకొని , అర కప్పు పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు కాళ్లకు మృదువుగా అప్లై చేసి 30 నిమిషాల పాటు మునివేళ్లతో మర్దన చేయాలి. ఇక బ్రష్ సహాయంతో మరొకసారి మసాజ్ చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగి వేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఫలితాలు పొందాలి అంటే కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు అదికూడా నిద్రించే సమయంలో చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.ఇక నిమ్మరసం, చక్కెర కూడా పాదాల యొక్క అందాన్ని పెంపొందిస్తుంది.

Beauty Tips Feet in Lemon juice Potato juice
Beauty Tips Feet in Lemon juice Potato juice

ఇంటిలో దొరికే ఈ రెండూ కూడా చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి పాదాలను అందంగా తీర్చిదిద్దుతాయి. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మిక్స్ చేయాలి. ఇక పాదాలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు స్క్రబ్ చేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం యొక్క రంగు కూడా మారుతుంది. బంగాళాదుంప రసంతో కూడా ఇలా చేసినట్లయితే తప్పకుండా ఫలితాలను పొందవచ్చు.