Health Benefits : భారతదేశంలో క్రీస్తు పూర్వం నుంచి ఉపయోగించే చిరుధాన్యాల లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాంటి వాటిలో రాగులు కూడా ఒకటి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఇలా అనేక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇక వీటితో పాటుగా విటమిన్ బి, ఐరన్ చాలా సమృద్ధిగా లభిస్తాయి. అందుచేతనే రాగులు చాలా మంచి చేస్తాయని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు రాగి జావ తాగితే ఎటువంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదని పూర్వికులు కూడా చెప్పేవారు.
అందుచేతనే ప్రతి ఒక్కరూ అప్పట్లో రాగిజావ ఎక్కువగా తాగేవారు.ప్రతిరోజు రాగి జావ ని తాగడం వల్ల ఎటువంటి రోగాలకైనా చెక్ పెట్టవచ్చని నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది. రాగులను ఉప్మా గా చేసుకుని తిన్నా మన శరీరానికి అధిక బలం చేకూరుతుంది. రాగులను ఏవిధంగా తిన్నా సరే అవి కచ్చితంగా మన శరీరానికి బలమైన పోషకాలను ఇస్తాయి. రాగులలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు.రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, గుండెను రక్షించడానికి ఈ రాగి జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రాగుల లో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి.. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పేగులలో పుండ్లు కాకుండా చూస్తుంది. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది.ఎముకల దృఢత్వానికి కండలు బలంగా పెరగడానికి ఈ రాగి జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుచేతనే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో రాగిజావ తాగినట్టు అయితే ఎటువంటి సమస్యకైనా చెక్ పెట్టవచ్చు. అయితే రుచి కోసం మజ్జిగ, బెల్లం వంటివి కలుపుకోవచ్చు.