Laughing Buddha : లాఫింగ్ బుద్ధా ను ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే..!!

Laughing Buddha : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో లాఫింగ్ బుద్ధాను మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు కొన్ని సెకండ్ లు చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. అందుకే చాలామంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధా ను పెట్టుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. లాఫింగ్ బుద్దా ను చూడడం వల్ల మనసుకు ప్రశాంతత కలగడమే కాదు.. మనిషికి శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే లాఫింగ్ బుద్దా ను ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మంచిది అనే విషయం గురించి చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి లాఫింగ్ బుద్ధా ను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతే కాదు పెద్ద పెద్ద మాల్స్ లో, దుకాణాలలో కూడా మనం ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏ దిశలో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే విషయానికి వస్తే.. ముఖద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు. కానీ ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలాగ పెట్టుకోవాలి. ఇక ఈ లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లైతే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇక బాకీలు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా తిరిగి వచ్చేస్తాయి.

If you put the Laughing Buddha like this, all you need is gold
If you put the Laughing Buddha like this, all you need is gold

అప్పులు కూడా తీరిపోతాయి. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. వ్యాపారం చేసే దుకాణాలలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు.లాఫింగ్ బుద్ధాను దుకాణం యొక్క ప్రధాన ద్వారం దగ్గర కనిపించేటట్టు పెట్టీనట్లయితే వ్యాపారం వృద్ధి చెందుతుంది. చెడు దృష్టి ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. అంతే కాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లాఫింగ్ బుద్ధా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.