Dhan Prapti : ఈ పరిహారంతో ధనప్రాప్తి కలుగుతుందట..!

Dhan Prapti : మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ డబ్బు కోసం పాకులాడడం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రపంచం ముందుకు నడవాలి అంటే డబ్బు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. లోకంలో ఏ పని జరగాలన్నా.. ఎవరు ఏ పని చేయాలన్నా అందుకు మూలం డబ్బు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే చాలామంది తమ జీవితంలో సంపద పెరగాలంటే సుఖ సంతోషాలతో జీవించాలని భావిస్తూ ఉంటారు. నిరంతరం జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కష్టపడుతూ డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా డబ్బు మాత్రం నిలబడడం కష్టం గా మారిపోయింది.

ఇక చాలామంది చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతూ సంపద పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే.. పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అలా ఎవరైనా సరే తమ కుటుంబంలో సంపద పెరగాలని ఆలోచిస్తున్నట్లు అయితే అలాంటి వారు ఈ చిన్న పరిహారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ.. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో నిలబడక పోతే అలాంటివారు ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం మట్టితో తయారు చేసిన దీపపు ప్రమిదలను తీసుకొని ఎంతో అందంగా అలంకరించాలి.బియ్యం పిండితో ముగ్గువేసి దేవుడి గదిలో ఆ ముగ్గుపై ఈ ప్రమిదలు ఉంచి..

With this compensation comes Dhan Prapti
With this compensation comes Dhan Prapti

అందులో ఉప్పు వేయాలి. మరో చిన్న ప్రమిద తీసుకుని ఉప్పు పైన పెట్టి నెయ్యి వేసి.. ఒత్తి వేసి దీపం వెలిగించాలి. ఇలా ప్రతి శుక్రవారం కూడా ఈ పద్ధతి పాటించడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద కూడా పెరుగుతుందట. లక్ష్మీదేవికి పటిక బెల్లం, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 శుక్రవారాలు పాటించడంవల్ల సంపద పెరుగుతుందట. ఇక ఈ విధంగా వెలిగించిన దీపం ప్రమిదలు ఏం చేయాలి అనే విషయానికి వస్తే.. మరుసటి రోజు ఉదయం పారే నీటిలో వేయాలి. మరి ప్రమిదలను శుభ్రం చేసుకుని తిరిగి వాడవచ్చు. ఈ ఆర్టికల్ ప్రయోజనకరంగా ఉంటే డబ్బు కోసం ప్రయత్నం చేసేవారికి వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు.