Memory Power : జ్ఞాపకశక్తి మెరుగు పడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?

Memory Power : శరీరంలో అన్ని అవయవాల పనితీరు మెదడు ఆదేశానుసారం గానే ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. మెదడు ఆదేశం లేనిదే శరీరంలోని ఏ అవయవం కూడా పని చేయదు అని చెప్పవచ్చు. అలాంటి మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించే కొన్ని ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.. అప్పుడే మెదడు పనితీరు మెరుగు పడడం తో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇకపోతే మెదడు పనితీరు మెరుగు పడాలంటే ముఖ్యంగా వాల్ నట్స్ ఎంతగానో సహాయపడతాయి.

వాల్ నట్స్ లో ఉండే ఫోలిఫినాల్స్, న్యూరాన్స్ అలాగే బ్రెయిన్ మధ్య కమ్యూనికేషన్ ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రోజూ మీరు రెండు వాల్నట్స్ కనుక తింటే మెదడు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.చిన్నపిల్లలు వాల్ నట్స్ తినడం వల్ల వారి జ్ఞాపక శక్తిని పెంపొందించిన వాళ్ళము అవుతాము. ఇక వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ ను కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. డార్క్ చాక్లెట్ కూడా మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంపొందించడంలో సాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరగడమే కాదు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా దూరం చేసుకోవచ్చు.

What kind of food to improve Memory Power
What kind of food to improve Memory Power

ఇక ప్రతిరోజూ మీ మెదడు చురుగ్గా పని చేయాలంటే కనీసం చిన్న చాక్లెట్ అయినా కచ్చితంగా తినాలి.అంతేకాదు పుదీనా వాసన కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా రిఫ్రెష్ గా పని చేసే పుదీనాను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జ్ఞాపకశక్తి పెరగాలంటే పుదీనా టీ రోజు తాగాలి. అంతేకాదు టమోటా లో కూడా లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మెదడు కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ప్రతిరోజు టమోటా తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.