Health Tips : పొద్దుతిరుగుడు విత్తనాలతో అనారోగ్య సమస్యలు పరార్..!

Health Tips : పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా చక్కటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తాయి. ఇక ముఖ్యంగా ఆడవారు ప్రతి రోజు నాలుగు విత్తనాలు చొప్పున పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు తెలియజేశారు. ఇకపోతే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా లభిస్తుంది. అయితే ఎక్కువగా తింటే మాత్రం కడుపు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది .

చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరం అవడంలో ఈ విత్తనాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ b6 లభించడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.పొద్దుతిరుగుడు విత్తనాలను గర్భిణీ స్త్రీలు తినడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల కూడా సహాయపడుతుంది. గాయాలు అయిన వారు కూడా పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల త్వరగా గాయాలు మానుతాయి. ఇక ఈ విత్తనాలలో మనకు విటమిన్ సి తోపాటు ఫ్లేవనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. విటమిన్-సి కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు దూరం అవ్వడమే కాకుండా దంతాలు , చిగుళ్లు కూడా మారుతాయి.

Illness problems with sunflower seeds can be avoided
Illness problems with sunflower seeds can be avoided

రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు . ఇకపోతే ఎప్పుడు తినాలి అంటే వారానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే గుప్పెడు మోతాదులో తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.జుట్టు ఎదుగుదల కూడా ఇందులో ఉండే పోషకాలు బాగా పనిచేస్తాయి. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు కూడా వారంలో మూడు సార్లు ఈ విత్తనాలు తినడం వల్ల సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి వీలైనంత వరకు రోజుకు కొన్ని చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆడవారికి రొమ్ములలో వచ్చే గడ్డలను నయం చేయడంలో కూడా ఈ విత్తనాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా వైద్యుడి సలహా తీసుకొని తినడం మంచిది.