Gurrapu Nada : గుర్రపు నాడతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయా..?

Gurrapu Nada : వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులు రైతు ని అనుసరించి పని చేయాల్సి ఉంటుంది. విత్తనం వేయడం మొదలు ఆ తర్వాత పంట పండి ఆ విత్తనాలు ఇంటికి చేరే వరకు ఎద్దులే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాలలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది కానీ.. పూర్వకాలంలో అంతేకాదు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఎద్దులతో నే రైతులు వ్యవసాయ పనులను పూర్తి చేస్తున్నారు. ఎద్దులు వ్యవసాయ పొలంలో నడిచేటప్పుడు కంపలు, రాళ్ళు వాటి కాళ్లకు గుచ్చుకోకుండా వాటికి నాడాలు కొడతారు. మనం చెప్పులు ఎలా ఉపయోగిస్తామో.. వీటికి కూడా నాడాలు ఉపయోగిస్తారు.ఇలా చేయడంవల్ల ఆ ఎద్దులు వ్యవసాయ పనులలో ఇబ్బంది లేకుండా రైతుకు సహాయపడతాయి.

ఇక ఇదే పద్ధతిని గుర్రపు కాళ్ళకి కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఎద్దులకు కొట్టిన నాడా లతో ఎటువంటి ఉపయోగం లేదు కానీ గుర్రపు కాళ్ళకి కొట్టిన నాడాల తో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనే అపోహలో చాలామంది బ్రతుకుతున్నారు. ముఖ్యంగా పేద వారు అలాగే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వారు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి డబ్బు పరంగా కూడా మరింత నష్టపోతున్నారు. గుర్రపు నాడాలు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అంటూ ఇంకా గుర్రాలను ఇబ్బంది పెట్టిన వీటిని ఆన్ లైన్ లో పెట్టి మరి అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.

Will financial difficulties be eliminated with horse belt 
Will financial difficulties be eliminated with horse belt

ఆన్లైన్లో అమ్మే అన్ని గుర్రపు నాడాలు ప్రస్తుతం ఎక్కడ దొరుకుతున్నాయి .. గుర్రాలు ఎక్కువగా ఎక్కడ కూడా పనిచేయడం లేదు.. ఈ విషయాన్ని ప్రజలు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. అనవసరమైన.. ఆలోచన లేని పనులు చేస్తూ చాలా మంది మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. గుర్రపు నాడ ఇంట్లో పెడితే లాభాలు వస్తాయి అని నమ్మి పూర్తిగా మోసపోవడం చాలా నేరం.. గుర్రపు నాడ తో అదృష్టం వస్తుంది అని చెబితే ప్రస్తుతం ఎవరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారు. అదేమిటంటే గుర్రపు నాడ వల్ల ఇంట్లోకి దిష్టి, శని ప్రభావం తగ్గుతుంది అని మన పూర్వీకులు నమ్మేవారు తప్ప.. వీటిని పెట్టుకుంటే లాభాలు వస్తాయని వారు కూడా ఎక్కడా చెప్పలేదు. ఇకనైనా ప్రజలు అప్రమత్తమై మోసాల భారిన పడకుండా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.