YS Avinash Reddy: అవినాష్ రెడ్డి ని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..!

YS Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ సుమారుగా నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీబీఐ ఆఫీస్ కి వచ్చిన అవినాష్ రెడ్డిని సాయంత్రం ఐదున్నర సమయంలో బయటకు పంపించారు. హైదరాబాదులోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన అవినాష్ ను సీబీఐ అధికారులు విచారించడం జరిగింది. విచారణ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు. తనపై మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.

YS Viveka murder: I told the facts I knew to the CBI, says YS Avinash Reddy

గతంలో టీడీపీ చేసిన విమర్శలను ఇప్పుడు సీబీఐ కౌంటర్లో వేసిందని తెలిపారు. తనను సీబీఐ అధికారులు మళ్లీ రావాలని చెప్పలేదు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. గత విచారణలో కాల్ డేటా ఆధారంగా విచారణ జరపగా ..ఆ సమయంలో సీఎం జగన్ ఆయన సతీమణి భారతీ ల పీ ఏ లకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారిని కూడా సీబీఐ విచారించింది.. వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపారని అందుకు సాక్షాలు కూడా ఉన్నాయని సిబిఐ తేల్చి చెప్పింది.అందులో భాగంగానే ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించినట్లు సమాచారం.