Pratibha Patil.. భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త కాంగ్రెస్ సీనియర్ నేత దేవి సింగ్ షేకావత్ స్వర్గస్తులయ్యారు . గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పూణేలోని కే ఈ ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ఈరోజే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది .
దేవి సింగ్ షేకావత్ ప్రతిభ పాటిల్ కు 1965 జూలై 7వ తేదీన వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. షేకావత్ మరణం పట్ల మహారాష్ట్ర గవర్నర్ రమేష్ వైస్, ఎన్సిపి అధినేత శరత్ పవార్ వంటి రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాగా ప్రతిభా పాటిల్ భారత ప్రథమ మహిళా రాష్ట్రపతిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు. అలాగే దేవి సింగ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా, మేయర్ గా కూడా పనిచేశారు. ఏది ఏమైనా పతీ వియోగం ప్రతిభాపాటిల్ ను మరింత కలచి వేస్తోంది.