Balakrishna: 2 సినిమాలు 32.50 కోట్లు.. రాయలసీమలో బాలయ్య ఊచకోత!!

Balakrishna:  నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా మొదటి రోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసి దుమారం రేపింది.. ఇక రెండవ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినా మళ్ళీ పుంజుకుంది.. వీర సింహ రెడ్డి సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది.. వీర సింహ రెడ్డి సినిమా రాయలసీమ ఏరియాలో మంచి కలెక్షన్స్ వసూలు చేయగా.. గత 2 సినిమాల కలెక్షన్స్ పరంగా బాలకృష్ణ మిగిలిన హీరోల కన్నా భారీ లీడ్ తో దుమ్ము దుమారం చేశారు.

Balakrishna Veera Simha Reddy movie rayalasima collections worthwhile
Balakrishna Veera Simha Reddy movie rayalasima collections worthwhile

స్టార్ హీరోల విషయంలో RRR ని పక్కకు పెడితే.. మిగితా సినిమాలైనా అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో 18.27 కోట్లు, పుష్ప 15.17 కోట్లతో కలిపి 33.44 కోట్లు వసూలు చేయగా బాలకృష్ణ ఆ తరవాత స్థానంలో నిలవడం మరో ప్రత్యేకత. బాలకృష్ణ అఖండ సినిమాతో 16.05 కోట్ల షేర్ ని అందుకున్నారు. ఇక వీర సింహా రెడ్డి సినిమా 16.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

 

మొత్తంగా ఈ రెండు సినిమాలు కలిపి రాయలసీమ ఏరియాలో ఏకంగా 32.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. అఖండ కి ముందు కెరీర్ లోనే ఆల్ టైం లో అనిపించే లెవల్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు బాక్ టు బాక్ సక్సెస్ లతో రాయలసీమ ఏరియాలో తన స్టామినాని చూపిస్తూ బాక్ టు బాక్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు.

 

వీరసింహారెడ్డి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 127.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశాడు 1.79 కోట్ల లాభాలతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ లాభాలు 3 కోట్లకు చేరుకున్నాయని సమాచారం. వీర సింహారెడ్డి హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ ఏరియాలో బాలయ్య తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు.