Pathaan: బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం పఠాన్.. షారుక్ ఖాన్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక షారుక్ ఖాన్ పఠాన్ సినిమా చూసినా ప్రభాస్ ఫుల్ హ్యాపీ అయ్యారట.. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో.. పఠాన్ సినిమా ప్రభాస్ పట్టరాని సంతోషంలో ఉన్నాడని.. ఈ సినిమా కలెక్షన్లు చూసి తర్వాత తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సెట్ చేసుకున్నాడట ప్రభాస్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడమే కాదు ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎపిక్ రికార్డులతో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు ఇండియాలో 70 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్నాడు. ఇక యూ ఎస్ లో 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నాడు..
105 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా.. రెండో రోజు ఇండియాలో ఆల్ మోస్ట్ 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని.. వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుస్కెళ్తుంది. ఈ సినిమా 2 రోజుల్లో ఇండియాలో 155 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను.. వరల్డ్ వైడ్ గా 220 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.. సల్మాన్ ఖాన్ మొదటి సినిమా వరల్డ్ వైడ్ గా 210 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో రికార్డ్ కొట్టగా.. ఆ రికార్డ్ ఆల్ మోస్ట్ 7 ఏళ్ళు కొనసాగగా.. ఇప్పుడు ఆ రికార్డ్ ను కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ చేశాడు షారుఖ్ పఠాన్ సినిమాతో న్యూ ఎపిక్ రికార్డ్ ను భారీ మార్జిన్ తో నమోదు చేయబోతుంది.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూసిన ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్స్ పై ఈ విధంగా అనుకున్నారట. ఆదిపురుష్ సినిమా పిల్లలకి, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. సలార్ సినిమా మాస్ ఆడియన్స్ కి మాస్ ఎక్కుతుంది. ఈ రెండు కూడా భీబత్సమైన కలక్షన్ లు ఉంటాయి. పఠాన్ కలక్షన్ లు ప్రభాస్ కి ధైర్యం ఇచ్చాయట.. అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.