Naresh: సీనియర్ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. రమ్య టార్గెట్ ఏంటో నాకు తెలుసు. అందుకు మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను అంటూ కాల్ రికార్డ్స్ వినిపించారు నరేష్..
రమ్య నన్ను చంపడానికి గ్యాంగ్ తయారు చేసిందని నరేష్ మీడియా ముందుకి వచ్చి చెప్పారు. తను మా ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసేవారిలో ఒకరిని బీహార్ నుంచి ఒకరిని పిలిపించిందని.. వారితో తను ఎలాంటి ప్లాన్ వేసిందో కూడా తనకి తెలుసని నరేష్ ఆరోపించారు. రమ్య రఘుపతి టార్గెట్ ఏంటంటే నా దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం లేదంటే నన్ను చంపేయడం. 10 కోట్లు ఇస్తే రమ్య రఘుపతి కాంప్రమైజ్ అవ్వడానికి ఫోన్ కాల్ వినిపించారు.
నేను చచ్చిపోతే పోలీసులకు కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి. భార్య ఇవ్వాలి. తను కంప్లైంట్ ఇవ్వకపోతే.. తనకు వందల కోట్ల ఆస్తి వస్తుంది. ఎంత సిగ్గుచేటు.. ఎంత డేంజరస్.. రమ్య నే నాతో చాలాసార్లు డేంజరస్ గా ఆలోచిస్తానని చెప్పింది.
మా అమ్మ దగ్గర తను అసిస్టెంట్ గా జాయిన్ అయినప్పుడు తన సింపతి చూసి జానేసి నేనే పెళ్లి చేసుకుంటానని ఆఫర్ ఇచ్చాను. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది నేను తన ట్రాప్ లో ఉన్నానని.. ఏది ఏమైనా కానీ మేమిద్దరం ప్రేమించుకున్నాం.. కలిసి తిరిగాం.. నాతో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయిన రోజు రాత్రి రమ్య ఒక పబ్ లో ఫుల్ గా తాగేసి తన ఎక్స్ ఫియాన్సితో కలిసి గొడవ పడింది. తన చేతికి గాయమై బ్లడ్ కూడా వచ్చింది.. కానీ తను పోలీస్ కంప్లైంట్ చేయలేదు . ఈ విషయాన్ని రఘువీరారెడ్డిని కూడా అడుగుతాను అని నరేష్ మీడియా ముందు అన్నారు.