Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డికి మంచి ఆదరణ దక్కడంతో మేకర్స్ హైదరాబాద్ లో మేకర్స్ భారీగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ స్టేజ్ పై మాట్లాడుతూ.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని.. అంటూ టంగ్ స్లిప్పయ్యారు. దాంతో సోషల్ మీడియాలో ఊరుకుంటుందా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ లు చేస్తున్నారు. వాటిపై బాలయ్య వివరణ ఇచ్చారు..
అయినా కానీ నాగార్జున ఫ్యాన్స్ తోపాటు మెగా ఫాన్స్ కూడా తోడయ్యి బాలయ్యను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు.. అయితే బాలయ్య అన్న ఒక్క పదాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్న జనాలు.. గతంలో అక్కినేని వారసులు ముగ్గురు ఆడపిల్లల జీవితాలను నాశనం చేసినప్పుడు ఏం అనలేదే అంటూ నందమూరి ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
గతంలో దగ్గుబాటి లక్ష్మి ని నాగార్జున నిలువునా ముంచేశాడు. ఆయన కొడుకు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకొని ఓ అమ్మాయి జీవితాన్ని సగంలోనే తుంచేశాడు. ఇటీవల అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత జీవితాన్ని ఎలా నాశనం చేశాడో అందరికీ తెలిసిందే. ఇలా ముగ్గురు ఆడపిల్లలు ఉసురు పోసుకున్న అక్కినేని హీరోలను ఇంతవరకు ఓ మాట అనని అక్కినేని ఫ్యాన్స్ పొరపాటున సరదాగా అన్నా మాటలు పట్టుకొని ఇంత రాదాంతం చేస్తున్నారే అంటూ రివర్స్ అవుతున్నారు.
అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే ఏం అంటూ నందమూరి ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కి మెగా ఫాన్స్ కూడా తోడయ్యారు. కారణం వీర సింహ రెడ్డి సినిమా వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో ఉండటం.. దాంతో వాళ్ళు కూడా మధ్యలో బాలయ్య వ్యాఖ్యలను వైరల్ చేశారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరి ఫ్యాన్స్ లో ఎవరు చెబుతారో చూడాలి. బాలయ్య నాగేశ్వరరావు తనకు బాబాయి అని ఆయనపై గౌరవం, ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని బాలకృష్ణ అన్నారు.