Balakrishna: ‘ ఎం పీకుతారో పీక్కోండి ‘ బాలకృష్ణ ఓపెన్ సవాల్ !

Balakrishna: నందమూరి బాలకృష్ణ ను గత నాలుగు రోజులుగా ఎంతగా ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై నోరు జారిన బాలకృష్ణ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి స్పందించారు. నేను అక్కినేని నాగేశ్వరావు గారిని వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో కించపరిచే విధంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు.

Balakrishna very strong on that incident
Balakrishna very strong on that incident

అక్కినేని నాగేశ్వరరావు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తాను.. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన నుంచే నేను నేర్చుకున్నాను బాలకృష్ణ అన్నారు. తన పిల్లల కంటే ఎక్కువగా నామీద ప్రేమ చూపించేవారు.. ఎందుకంటే అక్కడ ఆప్యాయత ఉండదు ఇక్కడ ఆప్యాయత దొరుకుతుంది అని అన్నారు.. ఆ మాట మాట్లాడుతూ బాలకృష్ణ సెటైరికల్ గా నవ్వారు.

ఇక ఇదే అదునుగా తీసుకొని ట్రోలర్స్ మీమర్స్ మరోసారి బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారు. బాలకృష్ణ తన బాబాయి నాగేశ్వరరావు అని చెబుతూనే నాగార్జున ను ఇండైరెక్టుగా కామెంట్ చేస్తున్నారంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.. ఇక ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ మాత్రం ఏం పీక్కుంటారో పీక్కోండి నేను తగ్గేదేలే అన్న రేంజ్ లో ధీమాగా ఉన్నారు. ఇంత ఇష్యూ జరుగుతున్న కూడా ఇక బాలయ్య కాకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు.

అక్కినేని తొక్కినేని అని వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు . ప్రేమతో చేసిన వ్యాఖ్యలే తప్ప బాధపెట్టేటట్లు ఎవ్వరి విషయంలోనూ ప్రవర్తించనని బాలయ్య స్ట్రాంగ్ గా చెప్పారు. కానీ కొంతమంది మాత్రం కావాలని బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈ టాపిక్ ను ఇంకా పొడిగిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఎలాంటి నెగటివ్ ప్రచారం జరిగినా బాలయ్య స్పందించకూడదని ఉన్నట్లు సమాచారం.