Balakrishna: ఒక్క సినిమాకే చతికిల పడిపోయాడు అనుకున్నార్రా?? మెగా ఫాన్స్ కి ఫ్యూజ్ ఎగిరేలా బాలయ్య సంచలన నిర్ణయం..

Balakrishna: విక్రమ్ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ల రేంజ్ లో లోకేష్ కనగరాజ్ గురించి చర్చించుకోవడం మనం వింటున్నాం.. హాలీవుడ్ మార్క్ స్క్రీన్ ప్లే, పాత్రల కంటిన్యూషన్ ను లోకేష్ కనగరాజ్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు చూపిస్తూ తనదైన శైలిలో సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. అయితే ఈ దర్శకుడితో నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Balakrishna next movie on  Kollywood star director direction
Balakrishna next movie on Kollywood star director direction

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా కలెక్షన్ల భారంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.. కాగా శృతిహాసన్ వీర సింహారెడ్డి మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. అయితే బాలకృష్ణని మాస్ అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా లోకేష్ కనకరాజు చూపించాలని అనుకుంటున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని ఓ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది..

లోకేష్ బాలయ్య కాంబోలో రానున్న లింక్ అటాచ్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ ఇక నుండి చేయబోతున్న ప్రతి సినిమాకు కూడా ఒకదానితో ఒకటి లింక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తాం. తెలుగు లేదా ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు. తెలుగు లో కూడా లోకేష్ కనగరాజ్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడట.

లోకేష్ కనగరాజ్ తో టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ తో లోకేష్ చర్చలు జరిగాయని.. ఆల్మోస్ట్ ఈ సినిమా కన్ఫర్మ్ అయిపొయింది అని సమాచారం. మరి కొన్ని రోజుల్లో అఫిషియల్ స్టేట్మెంట్ రానుందని టాక్. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కి నోట మాట రావడం లేదట.