BREAKING : మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లా.!? మీ అకౌంట్ నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకుండానే మీ ఖాతా నుండి రూ.147.50 రూపాయలు కట్ అయ్యాయా.!? అయితే కంగారు పడకండి..! అంటూ తాపీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఓ ఝలక్ ఇచ్చింది..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో షాక్ తగిలింది. వినియోగదారులు ఎలాంటి లాభాదేవీలు జరపకుండానే.. వారి ఖాతా నుంచి డబ్బులు రూ.147.50 కట్ అవుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. రూ.147.50 కట్ అయినట్లు మెసేజ్ చూసి చాలా మంది ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి అడగగా.. కస్టమర్ల ఖాతా నుంచి మెయింటెనెన్స్ ఛార్జీగా ఈ డబ్బును కట్ చేస్తున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
అయితే ఇదే విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేస్తూ.. ఈ డబ్బును బ్యాంకు నుంచి 18 శాతం జీఎస్టీ ఛార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు కోసం వినియోగదారుల నుంచి మెయింటినెన్స్ సర్వీస్ కింద ఏడాదికి రూ.125 రికవరీ చేస్తోంది. ఇందుకు అదనంగా 18 శాతం జీఎస్టీ కలిపితే ఈ మొత్తం రూ.147.50 అవుతుంది. ఈ మొత్తం అమౌంట్‌ను కస్టమర్ల ఖాతా నుంచి కట్ చేస్తోంది.
ఇక ఏ కస్టమర్ అయినా డెబిట్ కార్డును చేంజ్ చేసుకోవాలంటే బ్యాంకుకు 300 రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇకనుంచి మీ ఏటీఎం కార్డులు యాక్టివ్ గా ఉంచడానికి ప్రతి సంవత్సరం ఈ అమౌంట్ మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.