Karthikadeepam 24 Oct Episode : కార్తీక్ కి విషం పెట్టిన వంటలక్క.. వాల్తేరు వాణి ప్లాన్ బెడిసి కొట్టిందా.!?

Karthikadeepam 24 Oct Episode : దీప ఆటోలో వెళ్తున్న శౌర్య ను చూస్తుంది.. ఆటో వెనకాల అమ్మ న్నాన ఎక్కడ ఉన్నారు అని రాసి ఉంటుంది.. శౌర్య నాకు కచ్చితంగా దొరుకుతుంది పదా అంటూ కార్తీక్ దీప ను ఎక్కించుకొని సౌర్య ఆటోను ఫాలో అవుతూ ఉంటారు.. చాలాసేపు ఫాలో అయిన తర్వాత శౌర్య ఆటో ఎటు వెళ్లిందో కనిపించదు.. సూర్య కనిపించకపోయేసరికి దీప ఏడుస్తుంది. శౌర్య ఎప్పుడు కనిపిస్తుందో ఇక నాకు అని దీప డీలా పడుతుంది.. ఇంతకుముందు శౌర్యను ఓ ఆవిడ దగ్గర చూశాను.. కానీ ఆ రోజు అక్కడ ఉంది శౌర్య అని నాకు తెలియదు నా చేతులతో నేనే శౌర్య తల కూడా నిమిరాను గుర్తు చేసుకుంటుంది.. నువ్వేమీ కంగారు పడకు వంటలక్క.. ఈ ఊర్లోనే ఉందని తెలుసుకున్నాం కదా ఖచ్చితంగా వెతికి పెట్టుకుందాం అని కార్తీక్ అంటాడు..

karthikadeepam-24-oct today full episode
karthikadeepam-24-oct today full episode

మోనిత కావేరికి ఫోన్ చేస్తుంది.. కావేరి మోనిత తో నేను పంపించిన అమ్మాయి నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతుంది.. హా.. ఇప్పుడే వస్తుంది అని మోనిత చెబుతుంది… వాణి అంటే నువ్వేనా అని మోనిత అడుగుతుంది.. వాణి అని పిలవకండి మేడం.. నన్ను వాల్తేరు వాణి అని పిలవండి.. నాకు కాస్త కిక్కు వస్తుంది.. ఇంతకీ నేను ఏం చేయాలో చెప్పండి అని మోనితను అడుగుతుంది వాణి.. ఇక సీక్రెట్ గా ఏదో వాణి కి చెబుతుంది మోనిత.. మీరు చెప్పిన పని నేను కచ్చితంగా చేస్తాను.. నీ మాటల్లో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అని మోనిత అంది.. కానీ ఏం చేస్తావో చూద్దాం అని అంటుంది.. అప్పుడే వాల్తేరు అని మీరు నాకు ఈ పని పూర్తి చేస్తే రెండు లక్షలు ఇస్తాను అని అన్నారు.. కానీ నేను ఈ పని చేయకపోతే మీకు పది లక్షలు ఇస్తాను అని వాల్తేరు వాణి అంటుంది .. సరే నేను ఈ పని చేస్తాను అని వాణి అంటుంది
.. మీరు వాట్సాప్ లో నాకు దీపా లోకేషన్ పంపించండి అని చెబుతుంది.. మోనిత వాణికి దీపా, కార్తీక్, దుర్గా ఫోటోలతో పాటు ఆ ఇంటి లొకేషన్ కూడా పంపిస్తుంది..

సారీ కనిపించకపోవడంతో దీపా కార్తిక్ కారులో ఇంటికి వచ్చేస్తారు.. అప్పుడే మోనిత ఏయ్ వంటలక్క నా కార్తీక్ ని ఎక్కడికి తీసుకు వెళ్లావు అని మోనిత అడుగుతుంది.. నా భర్తను నువ్వు ఇలా తీసుకువెళ్లాలంటే నీకు ఇంకోసారి మర్యాదగా చెప్పను అని అంటుంది.. నా కార్తిక్ జోలికి వస్తే ఎవరినైనా బెదిరిస్తాను వినకపోతే మాత్రం చంపేస్తాను అని మోనిత అంటుంది.. రా కార్తిక్ మనం మన ఇంట్లోకి వెళ్లిపోదాం అని మో కార్తీక్ ను పిలుస్తుంది.. కానీ కార్తీక్ దీప పక్కన నిలబడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు.. అప్పుడే వెళ్ళండి డాక్టర్ బాబు అని వంటలక్క అంటుంది.. ఏంటే నా మొగుడిని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అని మోనిత అడుగుతుంది. అయినా కార్తీక్ కి నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఏంటి.. నువ్వు కార్తీక్ చెబితే గాని రాడా.. ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అని మోనిత వంటలక్క మీద సీరియస్ అవుతుంది..

అంతలో మోనితను సపోర్ట్ చేస్తుందనుకున్న వాల్తేరు అని రివర్స్ గేర్ లో వచ్చి మోనిత చంప పగలగొడుతుంది.. ఏయ్ అని మోనిత అనగానే నోరు ఎత్తావంటే పళ్ళు రాలుతాయి అని వాణి వార్నింగ్ ఇస్తుంది.. మోనిత ఇప్పటివరకు మీ దగ్గర డ్రామాలు ఆడిందని.. కార్తీక్ తో చెబుతుంది నాకు ఓ బొటిక్ షాపు ఉండేదని నా కస్టమర్స్ అందరినీ కావాలని తన వైపు తిప్పుకుందని చెబుతుంది.. దీని అంతు చూడండి నేను అస్సలు ఊరుకోను . అలాగే కార్తీక్ సారు దీప ఇద్దరూ భార్యాభర్తలని బయట ఒక రుమర్ వినిపిస్తుంది.. దీని మీద పగ తీర్చుకోడానికైనా సరే వీళ్ళిద్దరినీ కలిపి తీరుతాను అని వాణి అంటుంది.

దీపని వదిన అని వాణి పిలుస్తుంది.. ఎలాగైనా సరే మీ ఇద్దరినీ కలిపి తీరుతాను ఆ బాధ్యత నాది అని వాణి అంటున్న.. వాణి మాటలని విన్న దుర్గా హ్యాపీగా ఫీల్ అవుతూ.. సూపర్ మేడం మీరు రావడంతోనే మోనిత చంప పగలగొట్టారు అని దుర్గా అంటాడు.. అయితే నేను ఇక్కడ ఎక్కడో ఒకచోట ఉంటాను అని వాణి అంటుంది.. మీరు మా దిపమ్మ రూమ్ లోనే ఉండండి అని అంటాడు దుర్గ.. ఇక వాణి రేపటి ఎపిసోడ్ లో దీప చేసిన టిఫిన్ లో విషం కలుపుతుంది.. దీప దుర్గా ఆ టిఫిన్ తింటుండగా కార్తీక్ అక్కడ వస్తాడు.. కార్తీక్ కి దీప ఆ విషం కలిపిన టిఫిన్ పెడుతుంది.. ఈ టిఫిన్ కార్తీక్ కచ్చితంగా చనిపోతాడు వాణి మనసులో అనుకుంటుంది.. ఎలా అపుతుందో తరువాయి భాగంలో చూద్దాం..