Intitni Gruhalakshmi 24 oct Episode : తులసి సామ్రాట్ ఒకే బెడ్ రూమ్ లో.. ఆ మాట విని కంగుతిన్న నందు..!

Intitni Gruhalakshmi 24 oct Episode :  ఏంటి మేడం మీ క్లోజ్ ఫ్రెండ్ ఇంకా ఇంట్లోకి రాలేదు అని లాస్య అంటుంది.. బయటి నుంచి పబ్లిసిటీ ఇవ్వడానికి నిన్న తెగించి మరీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా.. ఈరోజు నోరు పెగలడం లేదు ఏంటి అని నందు తులసిని ప్రశ్నిస్తాడు.. ఈరోజు ఊరు దాటి వెళ్తున్నారు.. రేపు దేశం దాటి వెళ్తారు అని నందు అంటాడు.. ఇన్ని మాటలు పడుతూ వెళ్లడం అవసరమా తులసి ఆగిపోవచ్చు కదా అని అనసూయమ్మ అంటుంది.. ఆ మాటల్ని పట్టించుకోని నేను ఆగిపోతే వాటిని నిజం చేసినట్టు అవుతుంది అత్తయ్య అని తులసి అంటుంది.. మీరేమంటారు మావయ్య 100% కరెక్ట్ నా కోడలు తప్పు చేయాలని నాకు తెలుసు అని అంటాడు పరంధామయ్య.. తులసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బయలుదేరుతుంది..

Intitni Gruhalakshmi 24 oct today full Episode
Intitni Gruhalakshmi 24 oct today full Episode

తులసి గారు మీరు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారని.. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.. ఎవరి ముఖాల్లోనూ సంతోషాలు కనిపించవు.. ఎప్పుడూ కారు మబ్బులకు కమ్ముకొస్తాయో తెలియదు.. ఎప్పుడు ఎటు నుంచి ఏ వేడి తగ్గుతుందో తెలియదు.. మీకు ఆ ఇంట్లో ఉండాలి అంటే చిరాకు పుట్టడం లేదా అని సామ్రాట్ అంటాడు.. అప్పుడే తులసి అది ఒక ఆనందమైన జైలు శిక్ష.. కావాలి అని అనిపించే శిక్ష.. వదిలించుకొని పారిపోయేది ఓ మధురమైన శిక్ష.. పారిపోవాలి అంటే ప్రేమ పాశం తెంపుకోవాలి.. ప్రేమ పాశం తెంపుకోవాలి అంటే.. గుండె రాయి చేసుకోవాలి.. గుండె రాయి చేసుకోవాలంటే అనుభూతుల్ని చంపుకోవాలి.. అనుభూతుల్ని చంపుకోవాలి అంటే ఇక ఆ బ్రతికి అర్థమే లేదు.. అది మరణంతో సమానం నేను కోరుకుంటుంది.. మరణం కాదు ప్రేమ పాసాన్ని అని తులసి అంటుంది.. మీరు చెప్పింది నిజం ప్రతిరోజు మా ఇంట్లో ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది.. కాబట్టే మేము మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంటుంది అని తులసి సామ్రాట్ అంటుంది.. ప్రేమ ఉన్నచోటే కోపం ద్వేషం అసూయ అన్ని ఉంటాయి అవి మనసుల్ని బాధపెడతాయి.. కానీ మనుషుల్ని కాదు కాదని అంటారా అని తులసి సామ్రాట్ ను అడుగుతుంది.. అవును అని సామ్రాట్ తల ఊపుతాడు..

అనసూయమ్మ కి లాస్య తులసి పై లేనిపోనివన్నీ ఎక్కేసి చెబుతుంది.. ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరే అత్తయ్య మీరే వీటన్నింటినీ పట్టించుకుని సాల్వ్ చేయాలి అని అనసూయమ్మకి చెబుతుంది లాస్య.. ఇప్పుడు నన్నేం చేయమంటావు అని లాస్య అని అడుగుతుంది అనసూయ.. తులసిని నిలదీయండి ఇంట్లో అందరూ ముందు గొడవ చేయండి అన్నట్టుగా లాస్య హింట్ ఇస్తుంది.. అప్పుడే అమ్మమ్మ టైం చాలా అయింది.. క్షణాల్లో వడ్డీ చేస్తాను రండి భోంచేద్దురు కానీ అని అంకిత పిలుస్తుంది.. అన్నం కాదే నాకు పెండం పెట్టు అని అంటుంది.. ఏమైంది అమ్మమ్మ అంత కోపంగా ఉన్నారని అంకిత అంటుంది..

సామ్రాట్ తులసి మీటింగ్ పూర్తి చేసుకునీ రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో కనిపించిన గుడిలో ఆగుతారు.. చూసిన ఓ ఇద్దరమ్మాయిలు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని ఇలాంటి వాడు తగిలితే ఇక్కడ ఈ గుడిలోనే మూడు ముళ్ళు చేసుకుంటాను అని అనుకుంటారు ఆ మాటలు తులసి విని నవ్వుకుంటుంది సామ్రాట్ పట్టించుకోనట్టుగా ఉంటాడు..

సామ్రాట్ తులసి ఇద్దరు తడిసిపోయి ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు.. మా ఫోన్ లో నెట్వర్క్ లేదు మీ ఫోన్లో నుంచి ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతారు.. తులసి వాళ్ళ మామయ్యకు ఫోన్ చేస్తుంది.. నెట్వర్క్ లేక సరిగ్గా మాట్లాడలేక పోతారు.. సంతోషం ఏంటంటే ఇంత పెద్ద తుఫాన్ లో కూడా మనకి తలదాచుకోవడానికి ఓ ప్లేస్ దొరికింది అని సామ్రాట్ అంటాడు.. ఈ ఇంటి పరువు గడప దాటి రోడ్డు మీద పడి తిరుగుతుంది అని అనసూయమ్మ నందు తో అంటుంది.. తెల్లారితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది అని అనసూయమ్మ కంగారు పడుతుంది.. అంకుల్ ఆంటీ ఇద్దరూ బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని.. నందు ఇందాక తులసి చేసిన నెంబర్ కి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు.. ఆ మాటలు విని నందు ఫ్యుజులు ఎగిరిపోతాయి..