Prabhas : తన భర్త లేకపోయినా ప్రభాస్ కోసం అతిపెద్ద మ్యాటర్ లో స్ట్రాంగ్ గా నిలబడ్డ కృష్ణం రాజు భార్య .. ఆమె తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ని కదిలిస్తోంది !

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు తను ఎదిగాడంటే.. అందుకు ప్రధాన కారణం ఆయన ఎంచుకునే స్క్రిప్ట్.. అందుకు కారణమైన కథ విషయంలో ప్రభాస్ చాలా జాగ్రత్త గా ఉంటాడు.. తన దగ్గరకు వచ్చిన ఏ స్క్రిప్టును ప్రభాస్ చదవకుండా వెనక్కి పంపించడు.. ప్రభాస్ తన కెరీర్ లో స్పీడ్ అప్ అవుతున్న సమయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు చదివేవారట.. ఆయనకు నచ్చిన స్క్రిప్టును ప్రభాస్ కి పంపించేవారట.. కృష్ణంరాజు ప్రభాస్ కోసం వచ్చిన చాలా స్క్రిప్ట్ లని గంటలు గంటలు టైమ్ వెచ్చించి చదివేవారు..

అందులో డార్లింగ్ కి సూట్ అయ్యే ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉంటుందేమోనని ఎంత టైం పట్టినా కానీ కృష్ణంరాజు కూర్చొని చదివే వారట.. అయితే గత నెలలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడుతున్నారు.. బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ నుంచి పాన్ star గా ఎదిగాడు ప్రభాస్.. దాంతో ఆయనకు వచ్చే స్క్రిప్ట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది .. అయితే ఇప్పుడు ఆ పనిని కృష్ణంరాజు భార్య శ్యామల దేవి చేస్తున్నారు.. తన దగ్గరకి వచ్చిన ఏ స్క్రిప్ట్ నీ వెనక్కి పంపడం ప్రభాస్ కి ఇష్టం ఉండదు అందుకే ఆమె ఆ బాధ్యత తీసుకున్నారట..

Prabhas scripts reading on Shyamala Devi

పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా తరవాత ఆ స్క్రిప్ట్ లు రావడం విపరీతంగా పెరిగింది.. శ్యామలాదేవి ఇప్పుడు ప్రభాస్ కి వస్తున్న ప్రతి స్క్రిప్ట్ ని తనే స్వయంగా చదువుతున్నారట.. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.. నువ్వు నిజంగా దేవతవు తల్లి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. నిజంగా ఈ విషయం ప్రభాస్ అభిమానులను కదిలిస్తోంది.. ఈ సమయంలో కూడా ఆవిడ ప్రభాస్ కోసం ఈ విధంగా కష్టపడటం అందర్నీ కదిలిస్తోంది.. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కు అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు..