Viral Video : ఈ ప్రేమ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు..!

Viral Video : ఒక పూట తిండి పెడితే జీవితాంతం విశ్వాసం శునకాల గురించి విన్నాం.. తాజాగా ఆ జాబితాలోకి కొండముచ్చు కూడా చేరింది శ్రీలంకలోని గట్టిగా లోవాలో ఓ వ్యక్తి కొండముచ్చుకు రోజు ఆహారం పెట్టేవాడు దానితో ఆడుకునేవాడు సడన్ గా అతను చనిపోవడంతో దాంతో కొండముచ్చు అతని వద్దకు వెళ్లి తట్టి లేపే ప్రయత్నం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కన్నీళ్ళతో అతడికి ముద్దు పెట్టింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఇన్ని రోజుల నుంచి తన కడుపు నింపిన మనిషి చనిపోవడంతో.. ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది.. ఇది శ్రీలంకలోని బట్టికలోవాలో జరిగింది.. బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్… అడవి నుంచి వచ్చిన ఈ కొండముచ్చుకు రోజూ ఆహారం పెట్టేవారని ఆయన బంధువులు చెబుతున్నారు.. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు.. అలా ఆయన చనిపోయన రోజు కొండముచ్చు చనిపోయిన ఆ వ్యక్తిని లేపే ప్రయత్నం చేయడం.. ఎంత సేపటికీ తను లేగవక పోవడంతో కన్నీరు మున్నీరుగా ఆయన దగ్గర కూర్చుని విలపించింది..

Hilltop affection video on viral
Hilltop affection video on viral

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు మనుషుల్లోనే కాదు.. మూగజీవుల్లోనూ ఉంటాయని చాటి చెప్పింది ఓ కొండముచ్చు.. మనుషుల కంటే కూడా మూగజీవులు ఎక్కువ విశ్వాసంగా ఉంటాయని తెలిసిన విషయమే.. ముందుగా ఆ జాబితాలోకి వచ్చేది కుక్క.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కొండముచ్చు కూడా చేరింది.. మనుషుల కంటే ఎక్కువ ప్రేమ మూగ జీవాలకు కూడా ఉంటుందని మరో సారి ఈ కొండముచ్చు నిరూపించింది..