Karthikadeepam 19 Oct Episode : కార్తీక్ సౌర్యను వెతికిస్తున్నాడని తెలుసుకున్న మోనిత.! దీపకి వంట చేసి పెట్టిన కార్తీక్..!!

Karthikadeepam 19 Oct Episode : దీప ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని వాళ్ళ అన్నయ్యతో అంటుండగా కార్తీక్ వస్తాడు.. వంటలక్క ఆ పూజ కర్ర నేను ఇల్లు దులుపుతాను అని అంటాడు అయ్యో డాక్టర్ బాబు మీకెందుకు ఈ పని నేను చేసుకుంటాను అని అంటాడు.. పర్వాలేదు అని కార్తీక్ బూజు కర్ర తీసుకుని బూజు దులుపుతుండగా.. దీప కార్తీక్ నెత్తిమీద దుమ్ము పడకుండా ఉండాలని కర్చీఫ్ తీసుకువచ్చి కడుతుంది. ఈరోజు నువ్వు వంట చేయకు వంటలక్క నేనే చేస్తాను అని కార్తీక్ అంటాడు.. అయ్యో డాక్టర్ బాబు మీకెందుకు అంత శ్రమ నేను చేస్తాను అని దీప అంటుంది.. నా వంట అంటే భయమేస్తుందా వంటలక్క అని కార్తీక్ అంటాడు.. అదేం లేదు డాక్టర్ బాబు మీరు బాగా వంట చేస్తారు అని నేను అనుకుంటున్నాను అని అంటుంది.. సరే అయితే నువ్వు కూర్చో నేను ఫాస్ట్ గా వంట చేస్తాను అని కార్తీక్ అంటాడు..

Karthikadeepam 19 Oct today full Episode
Karthikadeepam 19 Oct today full Episode

శివ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్లావు.. ఈ మధ్య నువ్వు నాకు సరిగ్గా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్తున్నావో మర్యాదగా చెప్పు అని మోనిత అడుగుతుంది.. అదేం లేదు మేడం చిన్న పని ఉంటే బయటకు వెళ్లాను అని శివ అంటాడు.. ఈమధ్య ఎప్పుడు చూసినా కనిపించడం లేదు.. మర్యాదగా చెప్పవా అని శివ ను మోనిత బెదిరిస్తుంది.. మోనిత మేడం సార్ ఇంట్లో ఉన్నారా మేడం అని అడుగుతాడు శివ.. లేరు అని మోనిత చెప్పగానే.. అయితే మీరు సార్ తో చెప్పను అంటే ఒక విషయం మీకు చెబుతాను అని శివ అంటాడు.. మొన్న ఒక అమ్మాయి దగ్గర మనం వినాయకుడి బొమ్మలు కన్నాం కదా.. ఆ అమ్మాయిని కార్తీక్ సారు వెతకమన్నారు.. ఆ అమ్మాయిని చదివిద్దాం అని చెప్పారు.. మంచి పని కదా అని వెతుకుతున్నాను మేడం అని శివ చెబుతాడు..

వెంటనే మోనిత మనసులో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి.. శౌర్య ను ఎందుకు వెతకమన్నాడు.. ఒకవేళ వెతికినా కూడా తనని చదివిద్దాం అని చెప్పాడు.. ఎందుకు చెప్పాడు.. కార్తిక్ కి గతం గుర్తుకు వస్తే శౌర్య ను దీప ముందు నిలబెట్టి నాకు వార్నింగ్ ఇస్తాడు కదా.. అలా ఎందుకు చేయలేదు అని అనుకుంటుంది మోనిత..

శివా నీకు ఓ 2000 జీతం పెంచుతున్నాను అని చెప్పి.. ఈ విషయం నాకు చెప్పావని కార్తీక్ సార్ తో అసలు చెప్పకు అని అంటుంది.. సరే మేడం చెప్పను అని శివ అంటాడు.. మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తానన్న తర్వాత ఈ విషయం ఎవరికైనా నేను ఎందుకు చెబుతాను మేడం అని శివా అంటాడు.. మోనిత దగ్గరకు దుర్గా వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.. అయినా ఇక్కడ కార్తీక్ లేడు కదా అని మోనిత అంటుంది .. కార్తీక్ సారు దీప దగ్గర ఉన్నారు కదా.. వాళ్ళిద్దరిని నువ్వు అక్కడ చూసావంటే కుళ్ళుకొని చేస్తావ్ అని దుర్గా అంటాడు.. అప్పుడే కోపంగా దీపా ఇంటికి మోనిత వస్తుంది.. అప్పుడే కార్తీక్ ఈరోజు వంట నాదే వడ్డింపు నాదే రా కూర్చొ వంటలక్క అంటాడు.. కలిపి గోరుముద్దలు కూడా పెట్టు కార్తీక్ అని మోనిత అంటుంది.. ఏం చేస్తున్నావ్ కార్తీక్ నువ్వు ఎక్కడ అని అడుగుతుంది..

రోజు పాపం వంటలక్క వంట చేస్తుంది కదా అందుకని.. నేను ఈరోజు వంట చేశాను అని కార్తీక్ అంటాడు.. ఏ రోజు కూడా నా కార్తీక్ చేత చిన్న పనిని కూడా చేయించని నేను అలాంటిది అమాయకుడిని చేసి నువ్వు వంట కూడా చేయించేసావా అని దీపని మోనిత అరుస్తుంది.. మోనిత ఇందులో వంట లెక్క ప్రమేయం ఏమీ లేదు నేనే తనని రిక్వెస్ట్ చేసి మరీ వంట చేశాను అని కార్తీక్ అంటాడు.. అలా చెప్పండి డాక్టర్ బాబు అప్పుడు కానీ తను శాంతించదు అని దీప అంటుంది.. అందుకే ఈ వంటలక్క దగ్గరకి రావద్దు అని చెప్పాను.. అసలు నీ బుద్ది బాగుంటే నేను ఎందుకు ఇలా వస్తాను.. నేను ఏం చేసాను అని మోనిత అడుగుతుంది.. నేను ఇంట్లో ఉంటే గంట ఆగి రమ్మను రెండు గంటలు ఆగి రమ్మను అని పంపిస్తున్నవు.. అందుకే ఇలా వస్తున్నాను అని కార్తీక్ అంటాడు.. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అని మోనిత అంటుంది.. డాక్టర్ బాబు అనింది కూడా నిజమే కదా మోనిత.. మొన్న ఎప్పుడో దుర్గా వచ్చినప్పుడు శివను పంపించి డాక్టర్ బాబు ని రెండు గంటలు బయట తిప్పి తీసుకురా అని చెప్పావు కదా అని దీప అంటుంది.. ఏ భర్త అయినా భార్య అలా చెబితే తట్టుకోగలడా.. అయినా డాక్టర్ బాబు మళ్లీ ఇంకోసారి నువ్వు ఎక్కడ అలా చెప్పిస్తావు అని ముందుగానే వచ్చేసారు అని దీప అనగానే.. మోనిత నోర్ముయ్ అని పెద్దగా అంటుంది..