Guppedanta Manasu 19 Oct Episode : వసుధర ఇంటికి దేవయాని.. గురుదక్షిణ మర్చిపో.. వసుధర నాకోసం వస్తుందన్న రిషి..!!

Guppedanta Manasu 19 Oct Episode : : గౌతమ్ ఈ భోజనం ఎక్కడి నుంచి తెచ్చావు రా ఇది అని అడుగుతాడు రిషి.. భోజనం బాగుంది కదా తిను అంటాడు గౌతమ్.. ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళు నొప్పులు పుడతాయి మర్యాదగా లోపలికి రా వసుధర అని రిషి పిలుస్తాడు.. వసుధర కాలేజ్ కి వెళ్దాం అని తలుపు తీయగా ఎదురుగా దేవయాని ఎదురుగా ఉంటుంది.. వసుధర నేను నీతో మాట్లాడాలి అని దేవయాని అంటుంది.. గురు దక్షిణ విషయం గురించి నువ్వు మర్చిపోయి మా ఇంటి కోడలిగా రా అని చెబుతుంది.. అది కాదు మేడం అని వసుధర చెప్పెలోగా.. త్వరగా బట్టలు సర్దుకుని రా మా ఇంటికి వెళ్దాం అని దేవయాని అంటుంది.. అప్పుడే ఈ విషయం గురించి రిషి సార్ కి చెప్పాలని వసుధర రిషి కి కాల్ చేస్తుంది.. వసుధర రిషి కి కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెబుతుంది..

Guppedanta Manasu 19 Oct Today full Episode
Guppedanta Manasu 19 Oct Today full Episode

ఇంటికి రాగానే సార్ అని వసుధర చెప్పబోతుండగా.. నేను చెబుతాను వసుధర అని దేవయాని అంటుంది.. ఎలాంటి షరతులు లేకుండా వసుధర మన ఇంటికి తీసుకు వెళ్దాం అని ఇక్కడికి వచ్చాను అని దేవయాని అంటుంది.. మీరు ఎందుకు పెద్దమ్మ బాధపడతున్నారు.. నిజం సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు.. ఒకరి అభిప్రాయాలను గౌరవించాలి.. ఒకరి అభిప్రాయాలను బలవంతంగా మార్చుకోమని చెప్పుకూడదు అని వసుధర అంటుంది.. విన్నారు కదా మేడం రిషి సార్ కి నాకు మధ్యన ఒక అడ్డుతెర మాత్రమే ఉంది.. అది అభిప్రాయ బేధం కాదు.. ఇది ఒక్క విషయం తప్పితే.. మా ఇద్దరి మధ్యన మంచి అవగాహన ఉంది మేడం అని వసుధార అంటుంది.. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని కష్టపడి ఇబ్బంది పడకండి మేడం అని వసుధార అంటుంది.. జరగాల్సినవన్నీ సాఫీగా జరుగుతాయి.. మా కోసం మీరు ఆలోచిస్తున్నందుకు థాంక్యూ మేడం అని వసుధర అంది..

మేడం మీలాంటి పెద్దవాళ్లు మేమిద్దరం ఒక్కటి కావాలని కోరుకుంటున్నందుకు అది తప్పకుండా జరుగుతుంది మేడం అని వసుధర అంటుంది.. వసుధర నువ్వు మా ఇంటి కోడలిగా రావలిగా అని దేవయాని అంటుంది.. మేడం నేను మీ ఇంటి కోడలుగా వస్తాను.. అందరి ముచ్చట తీరుస్తాను.. నేను రాకుండా ఎవ్వరూ ఆపలేరు మేడం అని వసుధర దేవయాని నీ పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడుతుంది.. నేను చెప్పేది కూడా అదే కదా.. రమ్మనే కదా అని అంటున్నాను కదా.. మరి నువ్వేంటి తెలివిగా నటిస్తున్నావు అని దేవయాని అంటుంది.. పదా పెద్దమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని రిషి అంటాడు..

అయినా ఇలాంటి విషయాలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకోకూడదు అని రిషి అంటాడు.. అంతలో వసుధార ఇంటి ఎదురు ఆవిడ వచ్చి ఏంటి వసుధర ఏంటి గొడవ జరుగుతుందా అని అడుగుతుంది.. లేదు మా కుటుంబ విషయాలు చర్చించుకుంటున్నాము అని వసుధార అంటుంది.. దేవయానిని రిషి తన కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తాడు.. అంతలో దేవయాని ఏడుస్తుంది.. ఏమైంది పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు.. నీ బాధ గురించి నాకు ఒక్కదానికే తెలుసు రిషి అని దేవయాని అంటుంది.. వసుధార నాకోసం తన మనసు మార్చుకుని వస్తుంది పెద్దమ్మ.. నువ్వు బాధపడకు అని రిషి అంటాడు..