Pooja Hegde : పూజా హెగ్డే జీవితం – కెరీర్ సర్వ నాశనం చేయడానికి ప్లాన్ చేసిన టాప్ డైరెక్టర్ !!

Pooja Hegde : వామ్మో.. అదేంటి అంత పెద్ద మాట అనేసారు అనుకుంటున్నారా..? దాని వెనక ఓ కారణం ఉంది. పైగా ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ జోరుగా జరుగుతుంది. ఈమె కెరీర్ నాశనం చేయడానికి ప్రయత్నించిన ఆ దర్శకుడు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. పరిస్థితుల ప్రభావం కారణంగా తనకు తెలియకుండానే పూజా కెరీర్‌పై దారుణంగా ప్రభావం చూపించే నిర్ణయం తీసుకున్నాడు ఈ దర్శకుడు. అదే ఇప్పుడు ఈమె కెరీర్ కొంప ముంచేలా కనిపిస్తుంది. మొన్నటి వరకు చాలా నిశ్చింతగా ఉన్న పూజా హెగ్డేకు ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడి నిర్ణయంతో చుక్కలు కనిపిస్తున్నాయి.

director-skecth-on-pooja-life
director-skecth-on-pooja-life

Pooja Hegde :  అసలేం జరిగింది.. పూజాకు ఏమైంది..?

ఇటీవ‌ల ఓ టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్ సినిమా రిలీజ్ కాగా, దాని తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి . ఆ సినిమా గానీ హిట్ అయ్యుంటే కచ్చితంగా 200 కోట్లకు పైగా వసూలు చేసేది. తద్వారా హీరోతో పాటు డైరెక్ట‌ర్ సూపర్ హీరో అయ్యేవాడు. కానీ అలా జరగలేదు.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. 360 డిగ్రీస్‌లో జాతకం మారిపోయింది. దాంతో ఆ హీరో డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో రాబోవు సినిమా కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. నిజానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న తన డ్రీమ్ ప్రాజెక్టు ఇన్నాళ్ల‌కు ప‌ట్టాలెక్కేలా క‌నిపించింది.. కానీ ఇటీవ‌ల ఆ ద‌ర్శ‌కుడు తీసిన సినిమా ఫ్లాప్ కావ‌డంతో, ఈ ప్రాజెక్ట్ వైపే చూడ‌ట్లేద‌ట ఆ కుర్ర హీరో.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే హీరో డైరెక్ట‌ర్‌కి వచ్చిన నష్టమేం లేదు. ఈ ఇద్దరూ ఇతర సినిమాలతో బిజీ అయిపోతున్నారు. కాని అందులో ఎంపికైన పూజా హెగ్డే కెరీర్‌కే ఇక్కడ అసలు నష్టం వాటిల్లేది. ఈ సినిమా తన చేతిలో ఉంది కదా అని ధైర్యంగా ఉన్న పూజాకు ఇటీవ‌ల ఓ ద‌ర్శ‌కుడు తీసిన సినిమా ఊహించిన షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో చేయాల్సిన సినిమా ఆగిపోవడంతో.. ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే 2022లో పూజా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు పూజా చేయాల్సిన సినిమా కూడా ఆగిపోవడంతో.. ఈమె ఐరెన్ లెగ్ అంటున్నారు. అలా పూజా కెరీర్‌ను దారుణంగా దెబ్బతీసాడు క్రేజీ డైరెక్ట‌ర్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.