Smart Phone offers : బడ్జెట్ ధరలో రూ.10 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్స్ ఇవే..!! 

Smart Phone offers :  ప్రస్తుతం అటు ఫ్లిప్ కార్ట్ ఇటు అమెజాన్ రెండూ కూడా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈక్రమంలోనే ఎవరైనా బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మాత్రం ఈ రెండు సేల్స్ చాలా అనువుగా ఉంటాయి. ముఖ్యంగా రెడ్మి స్మార్ట్ ఫోన్లు శక్తివంతమైన బ్యాటరీ , కెమెరా , స్టోరేజ్ వంటి అధునాతన ఫీచర్లతో స్టైలిష్ లుక్ లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రకరకాల స్మార్ట్ ఫోన్స్ ను అది కూడా బడ్జెట్ ధరలో విడుదలవుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇదే సమయం సరైనదని చెప్పవచ్చు. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ లో భాగంగా అమెజాన్ లో రూ.10 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

smart phones available under Rs.10 thousand
smart phones available under Rs.10 thousand

Redmi A1:
ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవెల్ లో రూ.10వేల లోపు అందుబాటులోకి వస్తుంది. 16.56 Cm డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక స్క్రాచ్ రెసిస్టెన్స్ డిస్ప్లే తో అందుబాటులోకి రానుంది. ఇక కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ బ్యాక్ డ్యూయల్ కెమెరా అలాగే 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంటాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ..2GB ర్యామ్ , 32GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చింది

Redmi 9 Active:
హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. హీలియో G35 ప్రాసెసర్ తో లభించే ఈ స్మార్ట్ టీవీ 6.53 అంగుళాల హెచ్డి డిస్ప్లే ను కలిగి ఉంటుంది. 13+2 MP డ్యూయల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది.4GB ర్యామ్ , 64GB ఇంటర్నల్ మెమరీ తో అందుబాటులోకి వస్తోంది.

Redmi 10A:
ఈ స్మార్ట్ ఫోన్ మీకు పదివేల కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ 5000 mah బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక వీటితోపాటు మరెన్నో రెడ్మి స్మార్ట్ ఫోన్ లను మీరు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.