Big Boss 6 Telugu : హౌస్ బయట నుంచే రేవంత్ తలరాత మార్చేసిన ఆదిరెడ్డి భార్య కవిత.!

Big Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నిన్నటి వరకు టాప్ ఫైవ్ లో ఈ కంటెస్టెంట్ ఉంటాడు అని అనుకుంటే.. రేపటి రోజున ఏం జరుగుతుందో చెప్పలేం.. లాస్ట్ లో ఉన్న కంటెంట్ కూడా అనూహ్యంగా ఫినాలేలోకి వెళ్ళవచ్చు.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే జరిగింది.. ఇప్పటివరకు టాప్ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ కొనసాగుతున్నాడు.. కానీ 38వ ఎపిసోడ్ లో ఆ కాంటెస్టెంట్ కు వచ్చిన వీడియో కాల్ అతని ఫేట్ ను మార్చబోతున్నట్లు తెలుస్తోంది..! అతని టాప్ ఫైవ్ లో నిలబెట్టినట్లు తెలుస్తోంది..! ఇంతకీ ఆ కాల్ ఎవరికి వచ్చిందంటే.!?

Big Boss 6 Telugu aadireddy-wife-kavitha-who-changed-his-fate-from-outside-the-house
Big Boss 6 Telugu aadireddy-wife-kavitha-who-changed-his-fate-from-outside-the-house

ఈ మంగళవారం ప్రసారమైన 38వ ఎపిసోడ్ లోని వీడియో కాల్. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి తన భార్య కవితతో వీడియో కాల్ మాట్లాడుకునే ఆప్షన్ ఎంచుకున్నాడు. దాంతో ఆయన తన భార్య కవిత, కూతురు అద్వైత వీడియో కాల్ లో మాట్లాడారు. ఇందులో కవిత చాలా మెచ్యుర్డ్ గా మాట్లాడి ఆదిరెడ్డికి బూస్టప్ ఇచ్చిందనే చెప్పలి.. ఆమె బయట నుంచి ఆదిరెడ్డికి ఇవ్వవలసిన సపోర్ట్ అందించింది.. ఇక తన స్పీచ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.. ”ఒకప్పుడు నేను నిన్ను బిగ్ బాస్ కు వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు నేనే చెబుతున్నా.. బిగ్ బాస్ కు వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నాను.. నువ్వు నాకు ప్రోగ్రస్ అవ్వాలని ప్రతిసారి చెప్తావ్. అక్కడ ఉన్న ప్రతిక్షణం నువ్వు ప్రోగ్రస్ అవ్వడానికే ట్రై చెయ్యి. నీ వైపు తప్పు లేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైన సరే ఆర్గ్యుమెంట్ చేయి. ఒక కామన్ మ్యాన్ రివ్యూవర్ అయ్యాడు. ఒక రివ్యూవర్ ఇప్పుడు కంటెస్టెంట్ అయ్యాడు. ఆ కంటెస్టెంట్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. ఆ కెప్టెన్ రేపు బిగ్ బాస్ విన్నర్ అయి రావాలి. ఈ 3 నెలలు మేం నిన్ను ఎందుకు మిస్ అయ్యాం అనే ప్రశ్నకు సమాధానం నువ్ గెలిచి రావడం” అని కవిత ఆదిరెడ్డిలో ఆత్మవిశ్వాసం నింపింది..

ప్రస్తుతం ఆమె ఆది రెడ్డి తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆమె ఇచ్చిన బూస్టాప్ కి ఆదిరెడ్డి తన ప్రోగ్రెస్ ని పెంచుకుంటే మాత్రం కచ్చితంగా రేవంత్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.. ఆదిరెడ్డి యూట్యూబ్లో రివ్యూ చెప్పుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టినట్టుగా అందరూ భావిస్తున్నారు.. అయితే రేవంత్ కి ఆదిరెడ్డి ఏ మేరకు పోటీ ఇస్తాడు అనేదే చూడాలి.. బిగ్ బాస్ హౌస్ లో ఈ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. ఆ సస్పెన్స్ బిగ్ బాస్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు..