Capsicum Rice : కాప్సికమ్ + అన్నం తో ఈ వెరైటీ చేయండి .. మెతుకు వదలకుండా తినేస్తారు ఇంట్లో అందరూ ! 

Capsicum Rice : ప్రస్తుత కాలంలో రుచికరమైన ఆహారానికి చాలామంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మసాలాలను దూరంగా పెడుతూ సహజ సిద్ధంగా ఇంట్లో లభించే ఉప్పు , పసుపు, కారం వంటి వాటితో అద్భుతమైన రకరకాల వెరైటీలు చేస్తూ నోటికి కమ్మని రుచిని అందించవచ్చు.. మీరు ప్రతిరోజు లంచ్ బాక్స్ కు ఏం చేయాలి అని దిగులు పడుతున్నట్లయితే మీకోసం ఒక అద్భుతమైన ఫుడ్ రెసిపీ ను తీసుకురావడం జరిగింది. ఈ రెసిపీ వల్ల ఎటువంటి గ్యాస్ ,అజీర్తి లాంటి సమస్యలు దరి చేరవు అంతేకాదు హ్యాపీ టమ్మీ రెసిపీ అని చెప్పవచ్చు. ఇకపోతే క్యాప్సికం అన్నంతో తయారు చేసే ఈ వెరైటీ గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

Make this variety with capsicum  rice
Make this variety with capsicum  rice

ముందుగా వైట్ రైస్.. తినగలిగితే మీరు వైట్ రైస్ కి బదులు మిల్లెట్స్ పొడిపొడిగా వండుకొని కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు అయితే చాలామంది పొడిపొడిగా ఉండిన వైట్ రైస్ నే ఇలాంటి రెసిపీస్ కు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టాలి అందులో కొద్దిగా నూనె వేసి సన్నని మంట మీద నూనె వేడెక్కాక పోపు గింజలు వేయాలి. ఇపుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చాలా సన్నగా తురుముకోవాలి.

పచ్చిమిర్చి:

ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేస్తే చిన్నపిల్లలు తినేటప్పుడు తీసి పారేయడానికి వీలవుతుంది . లేదా కారం తక్కువగా తినేవారు కొంచెం పచ్చిమిర్చిని ఎర్రగా వేపుకుంటే సరిపోతుంది.

క్యాప్సికం:

ఇక ఒకటి లేదా రెండు క్యాప్సికం తీసుకొని చిన్నగా కట్ చేసుకుని.. రెండు నుండి మూడు నిమిషాలు పాటూ సన్నని మంట పై వేపుకోవాలి..

స్వీట్ కార్న్:

మీ వంటకు మరింత రుచి రావాలి అంటే స్వీట్ కార్న్ వాడితే సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే ఫ్రోజెన్ బఠానీ కూడా వాడుకోవచ్చు. మీరు ఫ్రోజెన్ కార్న్ ఉపయోగించినట్లయితే క్యాప్సికం వేగిన తర్వాతనే కార్న్ వేసుకోవాలి.

సాంబార్ పొడి:

రెసిపీలో వేసిన సాంబార్ పొడి ఎంతో ప్రత్యేకమైన పరిమళాన్ని అందిస్తుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి. సాంబార్ పొడి వేసాక 30 సెకండ్లు వేపితే చాలు పొడిలోని పరిమళం విడుదలవ్వడానికి.

ఇక చివరిగా.. నూనెలో అన్ని వేయించి పెట్టుకున్న ఈ పదార్థాలను తీసుకొని రైస్ లోకి కలిపేసుకుని చివరిగా మీకు కావాల్సిన ఉప్పు, కారం కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కమ్మనైన క్యాప్సికం రైస్ రెసిపీ తయారైనట్టే. మీ నోటికి మంచి రుచిని అందివడమే కాకుండా మీ పొట్టకి కూడా హాయిని కలిగిస్తుంది.