Ganguly-Dhoni : గంగూలీకి జన్మలో మరచిపోలేని వెన్నుపోటు పొడిచిన ధోనీ?

Ganguly-Dhoni : తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని.. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇక ప్రస్తుతం గంగూలీ నిష్క్రమణ వెనుక పెద్ద బాగోతమే నడిచినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని వెనుక భారత జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని హస్తం కూడా ఉన్నట్లు పుకార్లు బాగా షికారు చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ధోని ప్రముఖ పాత్ర పోషించాడు అని అందుకే గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అనే కోణంలో కూడా వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరి కొంతమంది నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గంగూలీ తీరు వల్లే ఆయనపై విమర్శలు వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

అందుకే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని తొలగించి ఆయన స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ని నియమించారు . ఇక గంగూలీ ఒంటెత్తు పోకడలతోని ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మరొక వివాదం ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ అలాగే మాజీ బీసీసీఐ అధ్యక్షుడైన శ్రీనివాసన్ ఆలోచన మేరకే ధోని గంగూలీ కి చెక్ పెట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బీసీసీఐ సమావేశంలో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ గట్టిగా వాదించారు దీంతో గంగూలీ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ వ్యవహరించిన తీరు పట్ల కూడా విమర్శలు రావడంతో ఇక ఆయనను అధ్యక్షుడిగా కొనసాగించడానికి ఇష్టపడలేదు. అందుకే ధోని సూచనల మేరకు సీఎస్కే బాస్ గంగూలీని తప్పించేందుకు తన వంతు కృషి చేసినట్లు సమాచారం.

Ganguly-Dhoni gave Ganguly an unforgettable backstab at birth
Ganguly-Dhoni gave Ganguly an unforgettable backstab at birth

కానీ గంగూలీ విషయంలో మహేంద్రసింగ్ ఎందుకంత ఆగ్రహంగా ఉన్నాడో తెలియడం లేదు. కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించాకే.. ధోనిని సారధ్య బాధ్యతల నుంచీ తొలగించారు . అందుకే అప్పటి నుంచే ధోనికి గంగూలీ అంటే కోపం పెరిగింది. గంగూలీకి సరైన సమయంలో బుద్ధి చెప్పాలని ఆలోచనలో ఉన్న ధోని ఇలా ఈ విధంగా శ్రీనివాసn సహాయంతో గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఉంటారని ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇండియా కి మూడు టైటిల్స్ తీసుకొచ్చిన ధోనీకి కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ధోనీకి గంగూలీ పై కోపం పెరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.