Vastu Tips : ఈ ఒక్క మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకోండి .. రేపటి నుంచీ అప్పులు అన్నీ తీరిపోతాయి !

Vastu Tips : ప్రకృతి ప్రసాదించే మొక్కలు మనకు అలంకరణను.. ఆరోగ్యాన్ని మాత్రమే కాదూ హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా వాస్తు సమస్యలతో ఇబ్బంది పడేవారు.. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల సకల సమస్యలు తొలగిపోయి ఆ ఇల్లు సంతోషాలకు నిలయం అవుతుంది. అలాంటప్పుడు మీరు కూడా నిరంతరం ఆర్థిక సమస్యలతో కుటుంబ కలహాలతో కుషించుకుపోతూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెట్టుకున్నట్లైతే కచ్చితంగా మీ అప్పుల బాధలు తీరిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.

వేప చెట్టు : ఔషధాలకు పుట్టినిల్లు అని చెబుతారు.. వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదంగా కూడా పరిగణిస్తారు. ఇంటి వాయువ్యము మూలలో వేప చెట్టును పెంచడం వల్ల దాని నుండి ప్రవహించే గాలి మీ ప్రధాన బెడ్ రూమ్ కిటికీల గుండా వెళ్లాలి . ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది . ఆర్థికంగా మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

స్నేక్ ప్లాంట్ : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని స్టడీ రూమ్ లో స్నేక్ ప్లాంట్ పెంచడం వల్ల ఆనందం , శ్రేయస్సు లభిస్తాయి. ఇక ఈ మొక్కను గదిలో లేదా పడకగదిలో కూడా ఉంచవచ్చు. ఇక మీ ఇంట్లో ఇలా ఈ మొక్కను పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.

Vastu Tips on Bring this one plant and keep it at home
Vastu Tips on Bring this one plant and keep it at home

అత్తిపత్తి : ఇంటికి వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో నాటడం వల్ల మీ జాతకంలో రాహు దోషం ఉంటే తొలగిపోతుంది. అయితే నిత్యం ఈ మొక్కకు నీళ్లు పోయడం మరవకూడదు.

లక్ష్మణ మొక్క : మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో లక్ష్మణ మొక్కను నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవికి ఈ మొక్కతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని అందిస్తుందట. అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని సాంప్రదాయాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ మొక్కను ఇంటికి తూర్పు లేదా తూర్పు – ఉత్తర దిశలో నాటడం వల్ల ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు తులతూగుతాయి.

కాబ్ ప్లాంట్ : ఈ మొక్క మీకు సంతానం పొందడానికి సహాయపడుతుంది. మీకు చాలా కాలంగా సంతానం కలగకపోతే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతేకాదు దానికి రోజు నీళ్లు సమర్పించి గణేశుడికి కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.