Hair Growth : మీ జుట్టుకి ఎలాంటి సమస్య ఐనా సరే.. వంటింట్లోంచి రెండు ఉల్లిపాయలు తెచ్చుకుని ఈ న్యూస్ చదవండి !

Hair Growth :  ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు రాలడం సమస్యతో భాదపడుతున్న వారే ఎక్కువ. ప్ర‌తి 10 మందిలో 9 మంది ఈ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఉల్లిపాయను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. పెద్దలు చెప్పిన ప్రకారం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే ఉల్లిపాయను వాడి జుట్టు సంబంధించిన సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయతో హెయిర్ ఆయిల్ నీ తయారుచేసి జుట్టు కి వాడండి. చాలామందికి జుట్టు అనేక రకాల సమస్యల వల్ల ఊడిపోతుంది. ఈ సమస్యను పోగొట్టుకోవడానికి ఎన్ని ఆయిల్స్ ని, షాంపూలని వాడిన ఈ సమస్య మాత్రం తగ్గదు. ఇలాంటి టైం లో ఉల్లిపాయను వాడమని నిపుణులు చెబుతున్నారు. జుట్టుని సంరక్షించుకోవడానికి ఉల్లిపాయను భాగంగా చేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఉల్లిపాయలు జుట్టు రాలడాన్ని, పల్చబడడాన్ని తగ్గిస్తుంది. ఇవి జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తాయి. ఇవి సల్ఫర్ కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనిలో ఎక్కువ పరిమాణంలో సల్ఫర్ నిండి ఉంటాయి. ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల ఇది జుట్టు పెరగడానికి, రక్త ప్రసరణ జరగడానికి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి మసాజ్ చేసుకోవాలి.

No matter what kind of problem you have with your hair with onions
No matter what kind of problem you have with your hair with onions

చుండ్రు తగ్గడానికి : చుండ్రు సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుంది. ఇది స్కాల్ఫ్ చికాకు, దురదను కలుగజేస్తుంది. ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు చుండ్రు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాక ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టుకు పోషణకోసం.. మీ జుట్టు పొడిగా, పెళుసుగా ఉన్నట్లయితే ఉల్లిపాయలు జుట్టుకు రక్షణగా పనిచేస్తాయి. దీనిలో కెంప్ఫెరోల్, క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్లలతో కూడి ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ,వాసో డైలేటరీ, యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉంటాయి. జుట్టుకు రక్త ప్రసరణను అందిస్తాయి. జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. మీకు తెల్ల వెంట్రుకలు రావడానికి కారణం హైడ్రోజన్ పెరాక్సైడ్ జుట్టు మూలాలలోని స్థాయిని తగ్గించి మీ జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. అంతేకాక ఇది మీ జుట్టును నల్లగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మ రసాన్ని వేసి దానిని బాగా కలిపి మీ జుట్టుకి అప్లై చేసినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాని దీనిని వాడే ముందు డాక్టర్ ని సంప్రదించి వాడాల్సి ఉంటుంది.