Amazon Great Indian Festival Sale : ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు అందులో భాగంగానే ఎక్స్ ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్ లో భాగంగా వస్తువులను కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. భారీ డిస్కౌంట్లతో పాటు యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇక పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైనా డీల్స్ కూడా లభిస్తున్నాయని చెప్పవచ్చు.
Amazon Great Indian Festival Sale : సాంసంగ్ గాలక్సీ S 22 స్మార్ట్ ఫోన్:
ఈ స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల ఫుల్ హెచ్డి డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఫీచర్ తో లభిస్తోంది. 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటు కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో మీకు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7000 బ్యాటరీ కూడా కలిగి ఉంది. 8GB ర్యామ్ +128 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ అమెజాన్లో 27% డిస్కౌంట్తో లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,000 వరకు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.85,999 కాగా ఆఫర్లో భాగంగా రూ.62,999 కే కొనుగోలు చేయవచ్చు.
IQoo Z6 Pro స్మార్ట్ ఫోన్:
6.44 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో లభించే ఈ స్మార్ట్ ఫోన్లో 90 Hz రిఫ్రెష్ రేటుతో లభిస్తోంది . 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా కాన్ఫిగరేషన్ తో పాటు 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది. 6GB ర్యామ్ +128 GB స్టోరేజ్ మోడల్ ను 21 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.27,990 కాగా.. ఆఫర్లో భాగంగా అమెజాన్ లో రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు
ఇక వీటితోపాటు రియల్ మీ, షావోమీ, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్లపై ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లో బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.