Trivikram : ఆ నటుడు ఇంట్లో మందు బాటిళ్లు దొంగతనం చేసిన త్రివిక్రమ్..

Trivikram : అదేంటి.. అంత మాట అనేసారు.. త్రివిక్రమ్ ఏంటి.. ఆయన రేంజ్ ఏంటి.. అతడెళ్లి మరో నటుడి ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి అనుకుంటున్నారు కదా..? కొన్ని నిజాలు అలాగే ఉంటాయి మరి. ఇది తప్పక నమ్మాల్సిన విషయం. పైగా ఈ నిజం చెప్పింది ఎవరో కాదు త్రివిక్రమ్. తనే స్వయంగా తాను దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ళ వేడుకలో చాలా విషయాలు బయటపెట్టాడు త్రివిక్రమ్. ఈయన స్పీచ్ చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రెండ్ అవుతుందిప్పుడు. పూర్తి ఫామ్‌లో ఉన్న త్రివిక్రమ్.. తన మాటల తూటాలు ఈ వేడుకలో బాగానే పేల్చాడు.

Trivikram : ఆ నటుడి ఇంట్లో దౌర్జన్యాలు..

2002, అక్టోబర్ 10న విడుదలైన నువ్వే నువ్వే.. 2022, అక్టోబర్ 10తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. అప్పటికే తెలుగులో నెంబర్ వన్ రైటర్‌గా ఉన్న త్రివిక్రమ్.. నువ్వే నువ్వేతోనే దర్శకుడిగా మారాడు. తండ్రీ కూతుళ్ల మధ్య సున్నితమైన ఎమోషన్స్.. ఓ అందమైన ప్రేమకథను మిక్స్ చేస్తూ ఈయన చేసిన ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ నువ్వే నువ్వే అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఈ సినిమా 20 సంవత్సరాల వేడుకలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్న త్రివిక్రమ్.. అప్పట్లో తాను చేసిన దౌర్జన్యాల గురించి కూడా గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు వయసు మీద పడి సైలెంట్‌గా ఉన్నాను కానీ అప్పట్లో మాత్రం అలా కాదని చెప్పాడు గురూజీ. మరీ ముఖ్యంగా లొకేషన్ లో ఎవరి మీద పడితే వాళ్ల మీద అరిచే వాడినని.. తనను భరించినందుకు చాలా మంది థ్యాంక్యూ చెప్పాలని తెలిపారు త్రివిక్రమ్. కోపమొచ్చి ఎన్నిసార్లు మానిటర్ వెనకాల మైకులు విరగ్గొట్టానో గుర్తు లేదన్నాడు త్రివిక్రమ్.

trivikram-news-viral
trivikram-news-viral

అప్పట్లో తాను అనుకున్న షాట్ రాకపోతే.. జిమ్మీ అసిస్టెంట్ల వెనక కొట్టడానికి పరిగెత్తే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అప్పట్లో ఈయన సిగరెట్లు కూడా బాగా కాల్చేవాడు. కేవలం నాలుగు సిగరెట్లు తాగే గ్యాప్‌లోనే నువ్వే నువ్వే సినిమా కథ అంతా చెప్పానని తెలిపాడు త్రివిక్రమ్. ముఖ్యంగా అప్పట్లో నటుడు ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లినపుడు తాను సునీల్ కలిసి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన వాచీలు లాక్కోవడం.. వాళ్లింట్లో ఏది దొరికితే అది తినేయడం.. అప్పుడప్పుడూ మందు బాటిల్స్ ఎత్తుకొని రావడం చేసేవాళ్లమని తెలిపాడు మాటల మాంత్రికుడు. ఒక్కటి కాదు.. అప్పట్లో చాలా దౌర్జన్యాలు చేశామంటూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ అందరికీ నవ్వు తెప్పించాయి.