Zodiac Signs : ఇంట్లో ఉండే ఆర్ధిక సమస్యలకి జ్యోతిష్య శాస్త్రం చెబుతోన్న బెస్ట్ సోల్యూషన్ ఇదే .. !

Zodiac Signs : సాధారణంగా కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా సరే.. ఆ డబ్బు నీరు లాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ఆ డబ్బులు దాచుకోలేక మరెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మనిషి సంతోషంగా ఉండాలి అంటే.. సంపద కూడా ముఖ్యమని చెప్పవచ్చు. ఇక ఆర్థిక సమస్యలతో మనసు కూడా కుషించుకుపోతుంది. క్రమంగా అనారోగ్య సమస్యలు.. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. అలాంటప్పుడు ఆర్థిక సమస్యలకు కారణం వాస్తు దోషం కూడా కావచ్చు. అందుకే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలకి ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది జ్యోతిష్య శాస్త్రం.. దీని ప్రకారం మీరు ఈ నియమాలను పాటించారు అంటే కచ్చితంగా ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక సంక్షోభం వల్ల డబ్బు లేకపోవడం.. ప్రశాంతత కోల్పోవడం.. ఇవన్నీ కూడా ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వల్ల కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు అంటే కేవలం ఇంటి గోడలను, పైకప్పులు మార్చడం కాదు .. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చినప్పుడే.. ఆర్థిక సంక్షోభాన్ని దూరం చేయవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు మీ ఇంటికి డబ్బు రాకుండా కూడా అడ్డుకుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఎండిన పువ్వులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. పువ్వులు శుభ చిహ్నాలు.. ప్రతి ఒక్కరి దేవుడి గదిలో దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా.. ఇకపోతే తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాంటి పువ్వులు వాడిపోతే ఇంట్లో పెట్టకూడదు. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు పటాలపై ఉన్న పువ్వులను మార్చాల్సి ఉంటుంది.

Zodiac Signs says the best solution for financial problems 
Zodiac Signs says the best solution for financial problems

మహాభారత పటం : మహాభారత చిత్రాన్ని ఉంచడం కూడా అశుభమే . వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారత చిత్రం ఉండడం వల్ల ఉద్రిక్తత , గొడవలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెంచుతాయి.

తాజ్ మహల్ ఫోటో : అలంకరణ కోసం తాజ్ మహల్ ఫోటోలను ఉంచుకోవడం లేదా ఇంటి గోడలకు తాజ్ మహల్ పెయింటింగ్ చేయడం చేస్తూ ఉంటారు . కానీ వాస్తు విశ్వాసాల ప్రకారం ఈ చిత్రాన్ని ఇంట్లో ఉంచకూడదు ఇది సమాధి మాత్రమే .. కాబట్టి ఇలాంటి సమాధి పెయింటింగ్ వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

కులాయిలో నీరు : మీ ఇంటిలోని కుళాయి నుండి నిత్యం నీరు కారుతున్నట్లయితే.. అది చెడుకి సంకేతం .. వంటగది, బాత్రూం లేదా మరేదైనా కొలాయి నుండి నీరు రావడం అరిష్ట సంకేతం.. నీరు ఎక్కువగా వృధా అయితే డబ్బు కూడా ఎక్కువగా వృధా అవుతుంది. కాబట్టి వెంటనే వీటిని సరి చేయండి. ఇలాంటి కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి దూరం అవ్వచ్చు.