Health Tips : ఆహారం లో గోంగూరని తింటే ఎంత మంచిదో తెలిస్తే .. ఇప్పుడే మీ ఆయనని రైతుబజార్ కి పంపిస్తారు ! 

Health Tips : వేడివేడి అన్నంలో గోంగూర కలుపుకొని తింటే.. ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో.. దాని రుచి మనసుకు హాయిని కలిగిస్తుంది. అయితే కేవలం అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాదు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి గోంగూరను ప్రతిరోజు లేదా వారంలో రెండు సార్లు తప్పకుండా మీ ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఖచ్చితంగా ఊహించని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా గోంగూరలో ఉండే పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2, బి 9, విటమిన్ సి తో పాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, సోడియం, ఐరన్ తో పాటు మరిన్ని ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ముఖ్యంగా గోంగూర విటమిన్ ఏ కి ఆది మూలం. గోంగూర నిత్యం తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు మనకు కలగడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గోంగూర ద్వారా ఏవైనా వ్రణాలు ఉంటే ఆముదంలో గోంగూర ఆకులను ముంచి వ్రణాలు లేదా గడ్డలు ఉన్నచోట పెడితే తొందరగా తగ్గిపోతాయి. ముఖ్యంగా రే చీకటితో బాధపడే వారికి గోంగూర అద్భుతమైన ఔషధం. ప్రతిరోజు గోంగూర పచ్చడి లేదా గోంగూరతో తయారుచేసిన పప్పు లాంటివి తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. రే చీకటి సమస్య కూడా దూరం అవుతుంది.

Health Tips on Gongura leaves
Health Tips on Gongura leaves

ఇతర కంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. గోంగూర ఆకులే కాదు పువ్వులు కూడా అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. గోంగూర పువ్వులను బాగా దంచి రసాన్ని తీసి .. వడకట్టి .. పాలలో కలిపి తాగడం వల్ల కూడా రేచీకటి సమస్య దూరం అవుతుంది. ఇక బోధ కాలు సమస్య తగ్గించడానికి కూడా గోంగూర సహాయపడుతుంది. గోంగూర ఆకులను, వేపాకులను మిక్స్ చేసి మెత్తగా నూరి.. ఆ ముద్దను బోదకాలుపై పూయడం వల్ల క్రమంగా సమస్య తగ్గిపోతుంది. తరచూ విరోచనాలకు గురయ్యే వారు కూడా ఇలా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. దగ్గు , ఆయాసంతో బాధపడేవారు అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా గోంగూరని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.