Karthika Deepam 10 oct Episode : మోనిత నాటకం ఆడుతుందని తెలుసుకున్న కార్తీక్.! దీప తో కలిసి ఉంటాడా.!?

Karthika Deepam 10 oct Episode : రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరకు అందరూ ముత్తైదువులు బతుకమ్మను తీసుకొని అక్కడికి వస్తారు.. సంగారెడ్డి బతుకమ్మ పండుగలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం.. దీప కూడా తను బతుకమ్మ ను తయారు చేసి తీసుకుని వస్తుంది… అప్పుడే కావేరి, మోనిత ఇద్దరు ఆ దీప కనిపించడం లేదు అని అనుకుటరు.. ఎప్పుడూ లేనిది ఈసారి దీపం చూస్తే కాస్త భయంగా ఉంది కావేరి అని మౌనిత అంటుంది. నువ్వేం కంగారు పడకు మోనిత అవసరమైతే ఇంకో పదిమందిని రంగంలోకి దింపైన సరే ఆ దీప సంగతి ఏంటో చూద్దాం అని కావేరి అంటుంది..

మోనిత కార్తీక్ ను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే సీన్ లోకి దుర్గ వచ్చి తూచ్ మోనిత ఇదంతా.. మన ఇద్దరం కలిసి వద్దాం అని చెప్పి నువ్వు ఏంటి కార్తీక్ సార్ ను తీసుకుని వచ్చావు అని అంటాడు.. మనిద్దరం కలిసి బతుకమ్మ సంబరాలకు వచ్చే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అని అన్నావు కదా అని దుర్గా మౌనికతో అంటడు.. అలా అనిందా అని కార్తీక్ అంటాడు.. దుర్గ బాబు ఎలా ఉన్నారు అంటూ ఒక అతను కలిసి వచ్చి పలకరిస్తారు. దుర్గ ది కూడా ఈ ఊరే అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఏరా దుర్గా ఇప్పుడైనా రావడం ఇందాక మౌనితను చూసి ఒక్కటే వచ్చింది అని అనుకున్నాను. అంతలోనే నువ్వు వచ్చేసాను ఏది ఏమైనా మీరిద్దరూ కలిసి తిరుగుతుంటే చూడడం అలవాటు అయ్యింది అని.. వాళ్ళు అన్న మాటలు విని కార్తీక్ మౌనితను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు..

karthika deepam oct 10 today full episode
karthika deepam oct 10 today full episode

ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి శివ వచ్చి పలకరిస్తాడు. ఈరోజు మీరు పుట్టినరోజు అంట కదా సార్.. రాత్రి చెప్పి ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం అని అంటాడు. అప్పుడే శివ ను ఏంటి ఆదిత్య విసిగించకు అని అంటాడు.. నేను ఇప్పుడు నిన్ను ఏదో పేరు పెట్టి పిలిచాను అని అంటాడు.. ఆదిత్య అని శివా అంటాడు. ఏదో సంబంధం ఉంది అని కార్తీక్ గతం గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు.. సర్ మీరు అలా బలవంతంగా గతం గుర్తు తెచ్చుకోకండి అని శివ అంటాడు..

రాజ్యలక్ష్మి గారు ఆ అమ్మాయి ఉంది చూసారు ఆ అమ్మాయి మంచిది కాదు.. తన గురించి మీకు తెలీదు పెద్దమ్మ అని కావేరి అంటుంది.. నాకు తన గురించి తెలుసు అని రాజ్యలక్ష్మి అంటుంది. నేనే ఈ విషయం గురించి ఈ సంబరాలు అయ్యాకా మాట్లాడం అని అనుకున్నా.. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా విను అని మోనిత ను చూస్తూ.. నేను నిన్ను ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదు.. కార్తీక్ ను చూస్తూ తనని ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదు అంటుంది. ఇది మీ ఊరు కానపుడు మీకు ఈ ఊరికి ఏమిటి సంబంధం అని రాజ్యలక్ష్మి మోనిత ను నిలదీస్తుంది. నలుగురు మనుషులను పెట్టీ లేనిది ఉన్నట్టు చెబితే నిజం అవుతుందా అని రాజ్యలక్ష్మి అంటుంది.. మీరిద్దరూ ఎవరో నాకు తెలియక పోయినా తనే మంచిది.. తనే మంచిది అని ఎందుకు చెబుతున్నానటే కథ నువ్వే సృష్టించావు కాబట్టి.. నిజం కప్పి పుచ్చాలని చూస్తున్నావు కాబట్టి.. పెద్దమ్మ నువ్వు ఈ ఊర్లో ఉండటం లేదు కదా తను ఈ మధ్యనే వచ్చింది అని కావేరి అంటుంది.. ఇంకేం మాట్లాడకు అని కవేరిని అరుస్తుంది రాజ్యలక్ష్మి.. కార్తీక్ అంటే మోనిత ఇదంతా కావాలని చేసిందా అని అనుకుంటాడు.. అప్పుడే మోనిత కార్తీక్ కి ఈ విషయం తెలిసిందని షాక్ అవుతుంది..