Intinti Gruhalakshmi 10 oct Episode : అబ్బబ్బ అనసూయమ్మ రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చింది.! ఈ షాక్ లో నుంచి తులసి తేరుకుంటుందా.!?

Intinti Gruhalakshmi 10 oct Episode : తులసి కుటుంబం అంతా కలిసి గుడికి వస్తారు ఇక అదే గుడికి నందు లాస్య కూడా వస్తారు లక్కీ హాయ్ అని అనసూయ ఓపెన్ చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు వాడేమీ నీ చుట్టూ కాదు అని పరంధామయ్యతో ఉంటాడు అవును చుట్టం కాదు కన్నా కొడుకు వాడికి జనరల్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది అందుకే వాడు నా పేరు మీద అమ్మవారికి పూజ చేయాలి అని నన్ను వాళ్ళింటికి రమ్మని చెప్పారు నేనే గుడికి రమ్మన్నాను అని అనసూయమ్మ అంటుంది.. ఇప్పటికిప్పుడు నీ మీద ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది అని పరంధామయ్య అడుగుతాడు.. లాస్య, నందు ఇద్దరు అనసూయమ్మ, పరంధామయ్య కాళ్ళకు దండం పెడుతరు..

పంతులు గారు తులసిని చూస్తూ కుటుంబ సమేతంగా వచ్చారు. మీకు అంతా మంచే జరగాలి అని అంటారు. తులసి వాళ్ళ అత్తయ్య మామయ్య పేరుమీద పూజ చేపించమని చెప్పగా.. లాస్య ఈ సంవత్సరం అత్తయ్య, మావయ్య గారి పేరు మీద నేను పూజ చేయిస్తాను అని అంటుంది. మీకు ఏమైనా కోరిక ఉందా ముడుపులు కడతారా అని అడుగుతాడు.. నాకున్న కోరిక నా కోడలు చంటి పిల్లల్ని ఎత్తుకోవడం.. నేను మనవాళ్ళు, మనవరాళ్లు ను ఎత్తుకోవలి అని అంటుంది.. అయితే ముడుపులు కట్టమని పంతులుగారు చెప్తారు. ఆ ముడుపులు కట్టడానికి చాలా ఎత్తులో ఉంటాయి. అప్పుడే పంతులుగారు ఈరోజు మీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దరు జంటగా కలిసి ముడుపులు కట్టొచ్చు అని చెబుతారు. అంకిత నువ్వు అభి పైకెత్తించి ముడుపు కడతారు. అలాగే శృతిని ప్రేమ పైకెత్తించి ముడుపు కట్టిస్తాడు. ఆ సన్నివేశాన్ని దివ్య తన ఫోన్లో బంధిస్తుంది..

Intinti Gruhalakshmi 10 oct today full Episode
Intinti Gruhalakshmi 10 oct today full Episode

దసరా ఉత్సవాలులో భాగంగా ముందుగా తులసి గారు మీరు మీ గొంతులో బతుకమ్మ పాట పాడుతూ సంబరాలు స్టార్ట్ చెద్ధం అని అంటారు.. ఇక అందరూ కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆ బతకమ్మ చుట్టూ నృత్యం చేస్తారు.. లాస్య అప్పుడే హనీ ఒక్కటే కనిపిస్తుంది.. సామ్రాట్ ఎందుకు రాలేదు.. ఏదో జరిగింది అని అనుకుంది.. హనీ ఒక్కతే కనిపిస్తే.. అమ్మ హనీ ఎందుకు డాడీ రాలేదు అని అడుగుతుంది లాస్య.. నువ్వు ఎలాగైనా డాడిని ఇక్కడకు వస్తే బాగుంటుంది అని లాస్య అంటుంది.. అప్పుడే హనీ తన డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. డాడీ నాకు కడుపులో నొప్పిగా ఉంది త్వరగా రమ్మని చెబుతుంది.. ఇలా హనీ కి హింట్ ఇచ్చి రెచ్చ గొట్టనో లేదో అలా అల్లుకుపోయింది. ఇక నా మనసులో ఉన్నది జరుగుతుంది అని లాస్య మనసులో అనుకుంటుంది..

సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు.. ఏమైంది అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు. హనీకి కడుపులో నొప్పి అంట బాబాయ్.. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది.. మరి ఒకసారి తులసికి ఫోన్ అయిపోయావా అని అంటాడు.. చేశాను బాబాయ్ అందరి ఫోన్లో సైలెంట్ లో ఉన్నట్టున్న ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అని సామ్రాట్ అంటాడు. ఇక వాళ్ళ బాబాయ్ ని తీసుకొని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు.. తులసి ఇంట్లో వాళ్ళందరూ ఆ దసరా సంబరంలో మునిగిపోతారు. ఒక స్లిప్ తీసి అందులో ఏముందో చెప్పమని టాస్క్ ఇస్తారు. ముందు అంకిత అభి పాల్గొంటారు. కానీ అభి మనసులో ఏముందో అంకిత చెప్పలేక పోతుంది. ఆ తర్వాత లాస్య, నందు వెళ్తారు. లాస్య కూడా నందు మనసులో ఏముందో చెప్పలేక పోతుంది..

రేపటి ఎపిసోడ్ లో దసరా సంబరాల్లో భాగంగా అందరూ కలిసి కోలాటం ఆడతారు.. సామ్రాట్, తులసి ఇద్దరు ఫైనల్ గా ఆడి గెలుస్తారు అప్పుడే అనసూయమ్మ కోపంగా అయిపోయిందిగా ఆట పాట బహుమతి కూడా తీసుకున్నారు కదా.. మీ కోరిక తీరింది కదా ఇక బయలుదేరు అని సామ్రాట్ ను కోపంగా అనసూయమ్మ అంటుంది.. పొరపాటున కూడా ఇంకెప్పుడు మావయ్య మా కాలనీ వైపు రావద్దు అని సామ్రాట్ కి వేలు చూపిస్తూ అనసూయమ్మ వార్నింగ్ ఇస్తుంది.. సమాజాన్ని కాదు అనుకుని వదులుకొని మీకు లాగా మేము బ్రతకలేము అని తులసికి దూరంగా ఉండమని బ్రతిమలాడుకున్నాను.. తనని ఉద్యోగంలో నుంచి తీసేయమన్నాను అని అనసూయమ్మ తన నోటితోనే నిజాలను చెప్పేస్తుంది.. ఆ మాటలు విని తులసి షాక్ అవుతుంది..