Guppedanta Manasu 03 oct episode : ఈ ఎపిసోడ్ అస్సలు మిస్ కాకుడదురా బాబోయ్..! మహీంద్రా చేత దేవయానికి సారీ చెప్పించిన రిషి

Guppedanta Manasu 03 oct episode : రిషి కాఫీ షాప్ లో వసుధర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. వసుధర కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటుంది.. కాఫీ చెప్పి చాలా సేపు అయింది.. ఇంకా వసుధర తీసుకురావడం లేదు ఏంటి.. నా మీద కోపంగా ఉందా అని రిషి మనసులో అనుకుంటాడు.. అప్పుడే టూ మినిట్స్ సర్ అని వసుధర సైగ చేస్తుంది.. ఇక వసుధార కాఫీ తీసుకువచ్చి రిషి టేబుల్ మీద పెడుతుంది.. కూర్చో వసుధర అని రిషి అంటాడు.. సార్ డ్యూటీలో ఉన్నాను అని వసుధర అంటుంది.. అయితే నన్ను వెళ్లిపోమంటావని లేచి నిలబతడు.. సరేనా వసుధార తన పక్కనే నిల్చని ఉంటుంది.. రిషి కాఫీ కప్పులో కాఫీ సగం సాసర్లో పోసి పక్కన పెడతాడు కాఫీ కప్ తీసుకుంటూ తాగుతుంది.. రేపు కాలేజీకి వస్తున్నావు కదా అని రిషి అంటాడు.. వసుధర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది..!

దేవయాని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది.. ధరణితో ఆ ఆదిదంపతులు ఇంకా రాలేదా అని అడుగుతుంది. నా మీద అలిగారా అని అంటుంది. అప్పుడే రిషి ఇంట్లోకి వస్తాడు. మెట్లు ఎగుతుండగా చూసి నేను ఇప్పుడు ఏమన్నానని నామీద అలిగి భోజనం చేయకుండా ఉండాలి.. అంతా కోపం ఉంటే ఎలా నేను వాళ్ళని ఒక మాట అనే హక్కు నాకు లేదా అని దేవయాని దొంగ ఏడుపు ఏడుస్తుంది.. అది చూసిన రిషి దబగబా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వస్తాడు.. అసలు ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మ అని రిషి అడుగుతాడు.. అప్పుడే జగతి మహీంద్రా కూడా కిందకు వస్తారు.. పొద్దున ఆ వసుధర కాలేజీకి వచ్చిందంట కదా ఎందుకు వచ్చింది అని అడిగాను.. దానికి మహింద్రా అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నాను పెద్దమ్మ డాడీ ఏమన్నారో చెప్పండి అని విషయం అడుగుతాడు.. వదినగారు ఇప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని మహీంద్రా అంటాడు.. నీ గురించి వసుధార గురించి అడుగుతుంటే నా కొడుకు నా ఇష్టం నీకెందుకు అని అన్నాడు అని ఏడుస్తూ దొంగ ప్రేమ నటిస్తూ.. రిషి మనసులో చెడు అభిప్రాయం కలిగేలాగా దేవయాని అని మాట్లాడుతుంది..

guppedanta-manasu Rishi apologized to Devaya by Mahindra
guppedanta-manasu Rishi apologized to Devaya by Mahindra

ఇక ఆ మాటలకు కోపంగా కృషి డాడ్ ఈ విషయం గురించి ఏం మాట్లాడకండి సైలెంట్ గా ఉండండి.. రిషి నేను నీ కన్నతల్లిని కాదు కాబట్టే కదా వాళ్ళు ఈ మాట అనింది.. అయినా నిన్ను నేను కన్న తల్లి కంటే ఎక్కువగానే చూసాను కదా అని దేవాయని దొంగ ఏడుపు ఏడుస్తుంది.. డాడ్ పెద్దమ్మను అంత మాట అన్నారా అని రిషి అడుగుతాడు అసలు ఏం జరిగిందో తెలుసుకో రిషి అని మహేంద్ర అంటాడు.. డాడ్ మీరు అన్నారా లేదా అది చెప్పండి చాలు అని మహేంద్రని రిషి రెట్టిస్తాడు.. రిషి నా కొడుకు నీకు ఎందుకు అని అన్నారా లేదా అది చెప్పండి చాలు అని రిషి అంటాడు. అప్పుడే మహేంద్ర చేతిని చెప్పద్దు అన్నట్టుగా జగతీ కంట్రోల్ చేస్తుంది.. వెంటనే రిషికి కోపం వచ్చి ఏంటి మేడం మీరు డాడ్ ను మాట్లాడుకోకుండా కంట్రోల్ చేస్తున్నారా అని అడుగుతాడు..

నిజం చెప్పండి డాడ్.. నా కొడుకు నా ఇష్టం అని అన్నారా.. పెద్దమ్మ నాకు అతిపెద్ద ఆత్మీయురాలు.. తనే నాకు అమ్మ.. తనే నాకు గురువు.. తనే నాకు దైవ సమానం.. డాడ్ మాట్లాడండి.. అన్నారా లేదా.. మీరు ఏం మాట్లాడటం లేదు అంటే మీరు అన్నారు అనే కదా.. అయితే మీరు పెద్దమ్మ కి సారీ చెప్పండి అని అంటాడు.. అసలు ఏం జరిగిందో తెలుసుకో అని రిషి తో మహీంద్రా అంటాడు.. డాడ్ మీరు సారి చెబుతారా.. అని అంటాడు.. డాడ్ పెద్దమ్మ కి సారి చెబుతారా చెప్పరా.. అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతడు.. పెద్దమ్మ నేను నీకు సారి చెబుతున్నాను అని రిషి అంటాడు.. రిషి కోపంగా భోజనం చేయకుండా అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తాడు అప్పుడే మహేంద్ర పెద్దగా సారీ సారీ వదినగారు అని అంటాడు.. సారీ చెప్పాను అని విషయం చూస్తూ ఉంటాడు.. నా కొడుకు కోసం ఎన్ని మెట్లు అయినా దిగుతాను నా కొడుకు ఆకలితో పస్తు పడుకోవడం నాకు ఇష్టం లేదు అని మహేంద్ర దేవయానితో అంటాడు.. ఇంకా చాలా మెట్లే మిమ్మల్ని దింపుతాను మహేంద్ర అని అంటుంది దేవయాని.. ఇక వెంటనే రిషి మెట్లు దిగి కిందకు వస్తాడు వెంటనే మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మహీంద్రా చేతిని రిషి పట్టుకొని మీరు భోజనం చేయకుండా వెళ్ళిపోతే నేను భోజనం చేయను డాడ్ నాకు పెద్దమ్మ అంటే ఇష్టం అందుకే మీ మీద కాస్త కఠినంగా ప్రవర్తించి ఉంటాను సారీ డాడ్ అని రిషి అంటాడు..

రిషి దేవయానితో మాట్లాడుతుండగా వసుధర కాల్ చేస్తుంది.. తనతో మాట్లాడిన తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర వసుధర జాబ్ చేస్తుందని చెబుతాడు.. తను మిషన్ ఎడ్యుకేషన్ లో జాబ్ చేయడం ద్వారా మనకు చాలా ఈజీ అవుతుంది.. లేకపోతే వేరే వాళ్ళు అయి ఉండుంటే మనల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు పెద్దమ్మ అని రిషి చెబుతాడు.. రిషి కాల్ చేయచ్చు కదా అని వసుధర వెయిట్ చేస్తుంది.. మరో వైపు వసుధర రిషి కాల్ కోసం వెయిట్ చేస్తుంది..