Intinti Gruhalakshmi 03 oct Episode : తులసి పదవిని నందుకు పట్టం గట్టిన సామ్రాట్..! పట్టరాని సంతోషంలో లాస్య..!

Intinti Gruhalakshmi 03 oct Episode : అనసూయమ్మ తులసి అంత ప్రశాంతంగా పనిచేసుకోవడం చూసి.. సామ్రాట్ కి నేను చెప్పిన పని ఏం చేశాడు.. తన మనసులో ఏ దురు ఉద్దేశం లేకపోతే తులసిని తన ఆఫీసు నుంచి పంపించేసేయొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది.. అప్పుడే అభి వచ్చి ఏం చేశావు నానమ్మ అని అడుగుతాడు.. నేను చేయాల్సిన పని చేసేసాను రా ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను అని అభి అంటాడు..

అదేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటాడు.. నేను పని అయితే చేశాను.. ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను. ఇక నన్నేమీ అడగకు నన్ను విసిగించకు అని అనసూయమ్మ అంటుంది.. అప్పుడే తులసి వచ్చి ఏంటి అత్తయ్య అసలు ఏం జరిగింది అని తులసి అడుగుతుంది.. ఏం లేదు అని అనసూయమ్మ కవర్ చేసుకుంటుంది.. రేపు ఆఫీస్ కి వెళ్తున్నావా అమ్మ అని తులసి అనసూయమ్మ అడుగుతుంది.. వెళ్తున్నాను సామ్రాట్ గారు నామీద చాలా బరువు బాధ్యతలు పెట్టారు.. పైగా ఆయన నా మీద ఉన్న నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి కదా అని తులసి అంటుంది.. ఇంకొకసారి సామ్రాట్ ని కలిసి నేను అడిగిన విషయాన్ని గుర్తు చేయాలి అని అనసూయమ్మ మనసులో అనుకుంది..

ఝాన్సీ తులసి కి ప్రతి ఒక్క ఫైల్ వివరించి చెప్పి సంతకాలు చేయిస్తుంది. ఝాన్సీ సామ్రాట్ గారు నన్ను ఎంతగా నమ్ముతున్నారు నేను కూడా నిన్ను అంతే నమ్మి ఫైల్స్ మీద సంతకం పెడుతున్నాను. ఇది సామ్రాట్ గారి దగ్గరికి వెళ్లి వచ్చిన ఫైలేనా అని తులసి అడుగుతుంది. అవును మేడం ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ సార్ వెరిఫై చేశారు అంటూ తడబడుతూ తులసికి సైన్ చేయమని చెబుతుంది. అప్పుడే సామ్రాట్ వచ్చి తులసిని చూస్తాడు.. తులసి కూడా సామ్రాట్ ని చూసి లేచి నుంచుంటారు.. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు..

intinti-gruhalakshmi samrat gives tulasi position to samrat
intinti-gruhalakshmi samrat gives tulasi position to samrat

అనసూయమ్మ సామ్రాట్ వాళ్ళ ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది.. ఎక్కడికి నానమ్మ రెడీ అవుతున్నావు అని అవి అడుగుతాడు.. సాయంత్రం సామ్రాట్ వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది కదా ఆ ఫంక్షన్ కి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నాను అని అనసూయమ్మ అంటుంది.. వెంటనే అభికి వచ్చి నువ్వు వైపు నాకు హెల్ప్ చేస్తానని మాట ఇస్తున్నావు.. మరోవైపు అందరికీ నచ్చేలాగా చేస్తున్నావు ఏంటిది.. నానమ్మ చెయ్యకపోతే చేయనని డైరెక్టుగా చెప్పేసేయొచ్చు కదా అని అది అంటాడు నేను ఏం చేసినా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను.. ఒకరి కోసం బలవంతంగా ఏ పని చేయను.. నేను చెప్పాను కదా తులసి విషయంలో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను.. రాసి పెట్టుకో అని చెప్పి అనసూయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

మీరు వచ్చాక మేమందరం ప్రశాంతంగా పని చేసుకుంటున్నామని ఆఫీసులో అంతా తెలిసిన పొగుడుతారు.. అప్పుడే నందు వచ్చి అర్హత లేని వారికి ఉద్యోగం ఇస్తే ఇలాగే ఉంటుంది. 10 కోట్ల ఫైల్ మీద ఎలా చూసుకోకుండా సంతకం పెట్టవు తులసి అని నందు అరుస్తాడు. అప్పుడే సామ్రాట్ వచ్చి తప్పు ఎవరు చేసినా తప్పే అని అంటాడు. ఇక ఈ విషయంలో ఆలోచించడానికి ఏం లేదు తులసి గారు ఇకనుంచి మీరు మరింత కేర్ఫుల్ గా ఉండండి అని సామ్రాట్ ఇన్ డైరెక్ట్ గా తులసికి వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయాలు ఏమి మనసులో పెట్టుకోకుండా సాయంత్రం హనీ బర్త్డే ఫంక్షన్ కి మీరు తప్పకుండా రండి. మీరు రాకపోతే హనీ బర్త్డే కూడా చేసుకోదు అని సామ్రాట్ అంటాడు. ఇక రేపటి బర్త్డే ఫంక్షన్ లో కంపెనీ రెప్యుటేషన్ కాపాడిన అందుకే చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. తులసి పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో నేను తెలుసుకున్నాను.. ఇప్పుడు కంపెనీ జనరల్ మేనేజర్ గా ఆ బాధ్యతలను నందుకి అప్పగిస్తున్నాను అని సామ్రాట్ అనౌన్స్ చేస్తాడు.. తులసి ఏం మాట్లాడకుండా రెండు చేతులతో దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..