Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ – రష్మి గౌతమ్ పెళ్లి గురించి సుధీర్ పేరంట్స్ ని అడిగితే ఏమన్నారో చూడండి !

Sudigali Sudheer : బుల్లితెర ఇండస్ట్రీలో ఎప్పుడూ వైరల్ అయ్యే టాపిక్ ఏదైనా ఉందంటే అది మన సుధీర్, రష్మిల పెళ్లి టాపిక్ మాత్రమే. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకుల్ని కూడా ఎప్పుడూ వెంటాడుతూ ఉండే ప్రశ్న. ఇక సుధీర్, రష్మీ ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరికి సంబంధించిన వార్త ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్నో సందర్భాల్లో వారిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్స్ అని, కేవలం ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు అలా వర్క్ చేస్తామని అంతకుమించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఎన్నో సిట్యూవేషన్స్ లో ఈ జంట తెలిపారు.

అయితే ఆన్ సెట్ లో వీరిద్దరి కెమిస్ట్రీని చూసి ప్రేక్షకుల్లో మళ్లీ బోలెడు ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందని అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుందని అభిమానులు కోరుతున్నారు. ఈ ప్రశ్నను కేవలం సుధీర్, రష్మీల దగ్గరే ఆగకుండా వారి ఫ్రెండ్స్ అయిన రామ్ ప్రసాద్, శ్రీనులను కూడా అడుగుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో శ్రీనుకి సుధీర్, రష్మీ ల పెళ్లి ఎప్పుడూ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి స్కిట్స్ చక్కగా పర్ఫార్మ్ అవుతాయని, అందుకే టీమ్ వీరిద్దరితో ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేస్తున్నారని అంతే తప్ప వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, వారి జంట కేవలం రీల్ మాత్రమే తప్ప రియల్ కాదని కూడా అన్నారు.

Sudigali Sudheer and Rashmi Gautam Clarity On Marriage
Sudigali Sudheer and Rashmi Gautam Clarity On Marriage

Sudigali Sudheer : సుధీర్, రష్మీలు – వేర్వేరు ప్రపంచాలు

వీరిద్దరివి రెండు వేర్వేరు ప్రపంచాలని అన్నారు. అయితే మళ్లీ సుధీర్, రష్మీల పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుధీర్, రష్మీలు పెళ్లి చేసుకోబోతున్నారని, అయితే వీరి పెళ్లి గురించి మాట్లాడేందుకు వాళ్ల పేరేంట్స్ దగ్గరకు వెళ్లారనే న్యూస్ ట్రెండ్ అవుతుంది. మరి నిజంగానే సుధీర్, రష్మీల పెళ్లి గురించి ఒప్పించేందుకు వాళ్ల పేరేంట్స్ దగ్గరకు వెళ్లారా.. లేదా.. అనేది తెలియాలి. ఏది ఏమైనా వీరిద్దరి జంటను ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆరాటపడుతున్నారు.