Bigg Boss show : బిగ్ బాస్ షో ఆపేయాలి అనే పిటీషన్ చూసి .. ఒకే ఒక్క మాట అన్న జడ్జిగారు.. !

Bigg Boss show : దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ పొందిన రియాల్టీ గేమ్ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. మొదట ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అనువదించబడిన ఈ కార్యక్రమం.. క్రమంగా కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగులో ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించినప్పుడు మొదట్లో 18.7 టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత కాలంలో నాని, ఆ తర్వాత కాలంలో నాగార్జున ఇలా హోస్ట్ లు మారుతూ వచ్చారు. ఇక ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న నేపథ్యంలో కేవలం 2.5 రేటింగ్ మాత్రమే రావడం చాలా దారుణం.. ఈ షో ఈ మధ్యకాలంలో పలు విమర్శలకు కూడా గురి అవుతుంది.

గుర్తుతెలియని కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకురావడం.. పైగా కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ తో పాటు మరెన్నో చూడలేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో అశ్లీలత పెరిగిపోతోందని విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇక డబుల్ మీనింగ్ డైలాగులతో బూతులు మాట్లాడుకుంటూ కంటెస్టెంట్లు సెలబ్రిటీలమనే విషయాన్ని కూడా మరిచిపోతూ చాలా గలీజ్ గా ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ ను ఏకంగా బ్రోతల్ హౌస్ అని పిలిచిన సీపీఐ నారాయణ కి.. ఈయనకు తోడుగా శ్రీరెడ్డి కూడా బ్రోతల్ హౌస్ అంటూ బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా బిగ్ బాస్ హౌస్ ఆపేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు.

Bigg Boss show stop to Petition
Bigg Boss show stop to Petition

బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువైందని, వెంటనే షో ఆపివేయాల్సిందిగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈయన పిటిషన్ పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇక పిటీషన్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఇకపోతే ఐపీఎఫ్ గైడ్లైన్స్ ను బిగ్ బాస్ షో నిర్వాహకులు పాటించడం లేదు అని, అశ్లీలత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నామని చెప్పడంతో.. విచారించైన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ కేసులో కేంద్రం తరపు న్యాయవాది తన స్పందనకు కొంత సమయం కోరడంతో అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేశారు. ఇక అప్పుడు తుది నిర్ణయం తెలుపుతామని కూడా న్యాయస్థానం తెలిపింది.