Tangedu flowers : తంగేడు పూలు పూజకే కాదు.. ఆరోగ్యానికి కూడా అవసరమే అని మీకు తెలుసా..?

Tangedu flowers : తంగేడు పువ్వులు ఎక్కువగా తెలంగాణలో బతుకమ్మను పూజించడానికి ఉపయోగిస్తుంటారు.ఇవి పూజకే కాక,ఎండిన పువ్వులు మరియు మొగ్గలు అనేక ఆయుర్వేద లాభాలు కలిగి ఉన్నాయి. ఈ తంగేడు పువ్వు చర్మ సమస్యలకు మరియు శరీర దుర్వాసనకు ఇంటి చిట్కాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. నొప్పి, జ్వరం, మూత్ర ఇన్ఫెక్షన్లు, రుమాటిజం, కండ్లకలక, నోటి పూతలు మరియు లివర్ వ్యాధుల చికిత్సకు కూడా ఈ తంగేడు పువ్వును ఉపయోగిస్తారు.

మధుమేహ చికిత్సకు సహాయపడుతుంది: తంగేడు పూల సారం యాంటీ డయాబెటిక్ చర్యను కలిగి ఉంటుంది. తంగేడు పువ్వులతో చేసిన టీ తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫంగల్ మరియు సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ పూల రసంలో సాపోనిన్స్ అనే సహజ యాంటీమైక్రోబయల్ సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది వివిధ బ్యాక్టీరియల్ రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది.

Do you know that Tangedu flowers are not only for puja but also for health
Do you know that Tangedu flowers are not only for puja but also for health

ఈ తంగేడు పువ్వుల రసం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల సంక్రమణను నివారించే లక్షణాలను పుష్కళంగా కలిగివుంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.

ఇది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తంగేడు పూల టీ తరుచుగా తీసుకోవడం వల్ల ప్రేగు కదలికను తగ్గించి మలబద్దకానికి మంచి ఔషదంగా పనిచేస్తుంది.

తంగేడు పూలు స్త్రీలలో నెలసరి క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది.మరియు అధిక రక్త స్ట్రావాన్ని నిరోధిస్తుంది.నెలసరి క్రమంగా రాని మహిళలకు తంగేడు పువ్వుల టీ ప్రభావవంతంగా పని చేస్తుంది.

తంగేడు పూల కషాయం అధిక బరువుతో బాధపడేవారికి ఇది అధిక కొవ్వును తగ్గించడానికి, ఆరోగ్యకరమైన శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.మరియు తంగేడు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఎండిన తంగేడు పువ్వు పొడి ని లేపణంగా వేసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నల్ల మచ్చలను నివారిస్తుంది. అన్ ఈవెన్ స్కిన్ టోన్‌ మరియు చర్మం రంగును కూడా మెరుగుపరుస్తుంది.

ఇతర ప్రయోజనాలు: ఈ తంగేడు పూల సారం పుండ్లు చేతులు మరియు కాళ్ళలో ఎడెమా చికిత్సకు ఉపయోగిస్తారు.ఇది శరీరంలో రక్త ఉత్పత్తిని మరియు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది పొట్టలో ఆమ్లం ఏర్పడటానికి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది మరియు శరీరంలో అలసటను, నిస్సత్తువను తగ్గించడంలో సహాయపడుతుంది.