Smart Phone : నథింగ్ ఫోన్ 1.. విడుదలైన కొన్ని రోజుల్లోనే విపరీతంగా పాపులారిటీ ను సొంతం చేసుకుంది. ఇకపోతే నథింగ్ ఫోన్ తో పోటీగా మోటోరోలా ఎడ్జ్ 30 మాత్రమే వస్తోంది అని సమాచారం. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ లో కూడా ఒకే ప్రాసెసర్ ఉండడం గమనార్హం. మరి ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 5 వేలకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ త్వరలో ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే కొన్ని స్మార్ట్ ఫోన్లను సేల్ ధరలకు అమ్మడానికి సిద్ధం అయ్యింది.
ఈ క్రమంలోని ఫ్లిప్ కార్ట్ మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కన్నా ముందే మీరు మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ రూ.5,250 డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియంట్లలో లభిస్తోంది. విడుదల చేసినప్పుడు ధరలు చూస్తే.. 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999.. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. అయితే ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్తో సెల్ ప్రారంభమైంది ఏకంగా రూ.3000 ధర తగ్గింపుతో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు ఐసిఐసిఐ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్ తో కొంటే 10% తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్ తో బేస్ వేరియంట్ ను మీరు కేవలం రూ.22,749 కే సొంతం చేసుకోవచ్చు. ఇక రిలీజ్ ధర కన్నా రూ.5,250. తక్కువకే మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778 G + ప్రాసెసర్ ఉంది. ఇదే ప్రాసెసర్ తో నథింగ్ ఫోన్ వన్ కూడా రిలీజ్ అయింది. ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో నథింగ్ ఫోన్ పై కూడా రూ.5000 డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆఫర్స్ తో బేస్ వేరియంట్ ను కేవలం రూ.28,999 కే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.