Mobile : ఎవరైనా సరే కొత్త మొబైల్ ని కొనాలని ఆలోచిస్తూ ఉంటారు.. అది కూడా అందరికంటే కాస్త బెటర్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు విడుదలైన ఒక మొబైల్ డిజైన్ ను చూస్తే కచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన నథింగ్ మొబైల్ ఎంతలా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్పుకుపోయే మొబైల్ కూడా అంతే పాపులర్ అయ్యేలా కనిపిస్తోంది.. టెక్నో కామోన్ -19 సిరీస్ గల బ్రాండెడ్ నుంచి నాలుగు స్మార్ట్ మొబైల్స్ విడుదలయ్యాయి. అందులో ముఖ్యంగా టెక్నో కామోన్ 19, కామోన్ -19 ప్రో, కామోన్ -19 ప్రో 5G మొబైల్స్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక స్మార్ట్ మొబైల్ ని కూడా విడుదల చేయడం జరిగింది.
అదే టెక్నో కామోన్ -19 ప్రో మొండ్రియన్ ఎడిషన్.. ఈ ఫోన్ మొబైల్ మోడల్ గురించి కంపెనీ కొద్ది రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది. ఈ మొబైల్ వచ్చేవారం మనదేశంలో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్ వెనకవైపు రంగులను మార్చే ఒక మల్టీ కలర్ చేంజ్ బ్యాక్ కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మనదేశంలో మొట్టమొదటిసారిగా మల్టీకోర్ చేసి స్మార్ట్ మొబైల్ ఇదే.. ఈ మొబైల్ ధర 20వేల రూపాయిలు ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ మొబైల్ 8 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ తో ఈ మొబైల్ లభిస్తుందట. ఇక ఈ మొబైల్ ఫ్యూచర్లు రెగ్యులర్ మోడల్ ఫ్యూచర్ల లాగే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక రంగులు మార్చనున్నాయి… టెక్నో -19 ప్రో డిస్ప్లే విషయానికి వస్తే..6.8 అంగుళాల ఫుల్ హెచ్డి+STPS డిస్ప్లేను అందిస్తోంది. మీడియా టెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్ పై ఈ మొబైల్ పనిచేస్తుంది. 8GB ర్యామ్ తో పాటు అడిషనల్ 4GB RAM కలదు. ఈ మొబైల్ గేమింగ్ కోసం మీడియా టెక్ అని హైపర్ ఇంజన్ 2.0 కూడా కలదు. కెమెరా విషయానికి వస్తే ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సల్, ఉండగా.. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 5000 MAH తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా టెక్నో కామోన్ -19 ప్రో 5G టెక్నాలజీతోనే పనిచేస్తుంది. ఈ మొబైల్ 5G మొబైల్ కావడం గమనార్హం.