Bigg Boss 6 Telugu : ” రేవంత్ నాకు ముద్దు పెట్టాడు ” అన్న గీతూ కామెంట్స్ మీద రేవంత్ భార్య స్పందన !

BigBoss 6 Telugu :  పాశ్చాత్య దేశానికి చెందినటువంటి ఈ బిగ్ బాస్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ కూడా జరుపుకుంటున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల మధ్య సాగే సన్నివేశాలు ఒక్కొక్కసారి వైలెంట్ గా కూడా మారుతున్నాయి.. ప్రస్తుతం బిగ్ బాస్ 6వ సీజన్ రసవత్తరంగానే సాగుతోందని చెప్పవచ్చు. మొన్నటి వరకు బిగ్ బాస్ తన పుట్టినరోజు వేడుకలతో ఎవరికి నచ్చిన పర్ఫామెన్స్ వారు ఇచ్చారు.. ఇక బిగ్ బాస్ 32వ రోజు 33వ ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్ లో ఊహించిన విధంగా సింగర్ రేవంత్ పై షాకింగ్ విషయాలు బయటపడడం గమనార్హం.

ఇక ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనయా సుల్తానా, బాలాదిత్య, చలాకీ చంటి , ఫైమా, వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి అర్జున్ కళ్యాణ్ లు ఉన్నారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత రేవంత్, ఆదిరెడ్డి, గీతూ రాయల్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. అప్పుడు గీతూ.. రేవంత్ తో.. నీకు ఇది జరిగినప్పుడే చెప్పొచ్చో.. లేదో.. అని, అప్పుడే అనుకున్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా.. అమ్మాయిలతో నువ్వు బాగా ఫ్రీ మోడ్లో వెళ్ళిపోతున్నావుట్.. వాళ్ళు కంఫర్టబుల్ కాదో లేదో చూసుకో అని చెబుతుంది. నువ్వు దేని గురించి అంటున్నావో క్లారిటీగా చెప్పు అని రేవంత్ అడగడంతో.. నువ్వు నాకు బుగ్గ మీద ముద్దు పెట్టావు కదా! నేను కంఫర్ట్ గా ఫీల్ కాలేదు.. నీ ఉద్దేశం అది కాదు అని నాకు తెలుసు.. నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నా కానీ అంతగా ఎదుటి వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకోవాలని గీతూ తెలిపింది.. అప్పుడు రేవంత్ నాకు అలాంటి ఉద్దేశమే లేదు.. నీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు అని చెప్పాడు.

Bigg Boss 6 Telugu For work done by Revanth in Bigg Boss house
Bigg Boss 6 Telugu For work done by Revanth in Bigg Boss house

అప్పుడు మళ్లీ గీతూ మాట్లాడుతూ .. అది నాకు తెలుసు.. నిన్న ఫైమా పై కూడా నువ్వు పడుకున్నావు.. ఆమె కంఫర్టబుల్గా ఉందో లేదో నీకు తెలియదు.. వాళ్ళను ఒకసారి అడుగు.. అప్పుడు కచ్చితంగా చూసేవాళ్ళకు బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది .ఏంట్రా రేవంత్ ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు ముఖ్యంగా చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. నీకు ముందుగా జాగ్రత్త చెబుతున్నాను.. మీ భార్య అన్విత కూడా ఇలాంటివి తప్పుగా అనుకోకూడదు అని కదా! మా రేవంత్ ఏంటి ఇలా చేస్తున్నాడని అనుకోకూడదని నీకు జాగ్రత్త చెబుతున్నాను అంటూ గీతూ.. రేవంత్ తో తెలియచేసింది. అయితే గీతూని ముద్దు పెట్టడం , ఫైమా పై రేవంత్ పడుకోవడం లాంటివి ఎపిసోడ్ లో చూపించలేదు.. కాబట్టి రేవంత్ తన భార్య నుంచీ సేఫ్ అయ్యాడని చెప్పవచ్చు. ఒకవేళ వీటిని రేవంత్ భార్య అన్విత చూసి ఉంటే కచ్చితంగా ఆమె అర్థం చేసుకునేదేమో తన భర్త అలాంటివాడు కాదని, మొత్తానికైతే బిగ్ బాస్ లో వీటిని చూపించకుండా ఎడిటింగ్ లో కట్ చేసి రేవంత్ ని సేఫ్ చేశారు బిగ్ బాస్ నిర్వహకులు.