Karthika Deepam 17 Oct Episode : మోనిత దుర్గ కాళ్లు పట్టుకుందా.!? అయినా వదలద్దన్న దీప..!

Karthika Deepam 17 Oct Episode : ఏంటి బంగారం అలా ఉన్నావ్ అని మోనిత తో దుర్గ అంటాడు.. రేయ్ నాకసలే చిరాగ్గా ఉంది.. మర్యాదగా నువ్వు బయటకు పో అని మోనిత అంటుంది.. అంతేలే మనం అనుకున్న పని జరగకపోతే చిరాగ్గానే ఉంటుంది అని దుర్గ అంటాడు.. రాత్రి దీప ను లేపేయడానికి నువ్వు మనుషుల్ని పెట్టావ్ కానీ ఆ పని జరగలేదు.. నేను చంపేయడం ఏంటి రా అని మోనిత అనగానే.. కదా.. నాకు కూడా అదే అనుమానం వచ్చింది..  మనం లేపేయాల్సింది కార్తీక్ ని కదా అని దుర్గా అంటాడు.. దుర్గ మాటలు విని మోనిత షాక్ అవుతుంది.. కార్తీక్ కోసమే మనుషుల్ని పెట్టావు కదా అని దుర్గా అనగానే.. రేయ్ ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను కార్తిక్ వింటాడు.. నేను ఏమైనా కార్తీక్ ని అనుకుంటున్నావా గుడ్డిగా నీ మాటలు నమ్మేయడానికి.. నువ్వు ఎవరిని పంపించావో వాళ్ల బ్యాక్ గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు బంగారం అని దుర్గా అంటాడు.. ఇంట్లో కార్తీక్ సార్ ఉన్నారా.. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావా.. సరే నేను మళ్ళీ వస్తాను అని దుర్గ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

 

karthika-deepam-17oct today full episode
karthika-deepam-17oct today full episode

అప్పుడే కార్తీక్ కోపంగా మోనిత వైపు చూస్తాడు.. నువ్వు నాతో ఏ మనుషుల్ని పంపలేదు అని అన్నావు కదా.. మరి ఇదేంటి అని కార్తీక్ మోనిత ను నిలదీస్తాడు. వాడేదో అలా చెబుతున్నాడు కార్తీక్ అని మోనిత కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.. దీప నా భార్యనా అందుకే నువ్వు తన ప్రాణాలు తీయాలి అని అనుకుంటున్నావా అని కార్తీక్ అనగానే.. కాదు కార్తీక్ అని మోనిత అంటుంది.. నా వెనకమాల ఎవరు పడ్డా కూడా నువ్వు వాళ్ళ ప్రాణాలు తీయాలని అనుకుంటావా అని కార్తీక్ మోనితను గట్టిగా అడుగుతాడు.. చెప్పిందే పదిసార్లు చెప్పి.. బోరున ఏడ్చినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు.. అబద్ధం నిజం అయిపోదు.. నీలా ఫ్రాడ్ చేసేవాళ్లను చూస్తుంటే నాకు ఒళ్లంతా కంపరం ఎక్కుతుంది.. అసహ్యం వేస్తుంది.. ఛీ ఛీ అని వెళ్ళిపోతాడు కార్తీక్..

మోనిత దుర్గ దగ్గరకు వచ్చి తన కాళ్లు పట్టుకుని.. ప్లీజ్ దుర్గా కార్తీక్ నన్ను అలా అసహ్యించుకోవడం నేను భరించలేక పోతున్నాను.. వెళ్ళిపో దుర్గ ప్లీజ్.. ప్లీజ్ దుర్గ.. నువ్వు ఇదంతా నువ్వు ఆ దీప కోసమే చేస్తున్నావు కదా.. అలా చేస్తే నీకు ఏం వస్తుంది.. ప్లీజ్ దుర్గా నన్ను వదిలేసి నీకు నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తాను అని మోనిత అంటున్న మాటలను చూసి దుర్గా పెద్దగా నవ్వుతాడు.. అప్పుడే దీప కూడా అక్కడికి వచ్చి పెద్దగా నవ్వుతుంది.. చూసావా దీపమా ది గ్రేట్ డాక్టర్ మోనిత ఈ దుర్గ కాళ్ళు పట్టుకుంది.. ఇదే దుర్గ అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే..

ఏంటి వదిలేయాలా.. అయితే నువ్వు డాక్టర్ బాబుతో నిజం చెప్పే అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని దీప అంటుంది.. ఏంటే వదిలేది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కార్తీక్ ని వదిలేదే లేదు.. నిన్ను వదిలించు కోవడానికి తపస్సు ఎందుకు తేనెటీగలు తరిమినట్టు కార్తీక్ బాబు నిన్ను తరిమేస్తాడు అని దుర్గ అంటాడు.. అయినా ఏ భర్తకైనా చిన్న అనుమానం వస్తేనే భార్యను వదిలేస్తాడు.. అలాంటిది మోనిత ని ఇంకా కార్తీక్ సార్ ఎందుకు వదిలిపెట్టడం లేదు దీపమ్మ అని దుర్గా అంటాడు.. అసలు దీనిని భార్యగా అని అనుకుంటేనే కదా వదిలేయడానికి అని దీప అంది.. మర్యాదగా డాక్టర్ బాబును నాకు వదిలిపెట్టి పో అని దీప మోనితకు వార్నింగ్ ఇస్తుంది.. ఏంటి కాళ్లు పట్టుకుంటే తగ్గను అని అనుకుంటున్నారా నా సంగతి మీకు ఇంకా తెలీదు అని మోనిత రివర్స్ అవుతుంది..

ఇక్కడ నీకు ఒక విషయం చెప్పనా మోనిత నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నావు.. కానీ డాక్టర్ బాబు నా ప్రాణాలను కాపాడు.. అది మూడుముళ్ల బంధానికి ఉన్న విలువ అని దీప అంటుంది.. ఎంత చేసిన దీని పొగరు ఇంకా తగ్గడం లేదు దుర్గ చూడు ఎలా చూస్తుందో.. నువ్వు ఇక్కడే ఉండు దుర్గ.. నువ్వు దీనిని అస్సలు వదలకు.. టార్చర్ పెడుతునే ఉండు అని దీప దుర్గ తో అంటుంది.. ఎన్నాళ్ళు ఈ టార్చర్ ని తట్టుకుంటుందో నేను చూస్తా అని దీపా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
బంగారం అది మేటర్ అని దుర్గా అంటాడు..

కార్తీక్ శౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు.. కానీ తను దొరకదు.. సౌర్య నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక్కసారి కనిపించమ్మా.. నిన్ను తీసుకువెళ్లి మీ అమ్మతో జరిగిన నిజం మొత్తం చెప్పేస్తాను.. ఆ తర్వాత హిమ, నానమ్మల దగ్గరికి మనం వెళ్ళిపోదాము అని కార్తీక్ అనుకుంటాడు.. కానీ సౌర్య కనిపించకపోవడంతో దీపను చూస్తూ అలాగే ఉండిపోతాడు..