Intinti Gruhlakshmi 07 Oct Episode : సామ్రాట్ ను బయటే నిలబెట్టిన అనసూయమ్మ..! ప్రేమ్ ను అడ్డంగా బుక్ చేసిన ఆడవాళ్ళు..!

Intinti Gruhlakshmi 07 Oct Episode :  తులసి వాళ్ళ ఇంటికి కాలనీ వాళ్ళందరూ వస్తారు.. అనసూయమ్మతో కాలనీలో మొదటిసారి దసరా సంబరాలు చేస్తున్నామని చెబుతారు.. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది.. ఏంటి కాలనీ ప్రెసిడెంట్ గారే కదిలి మా ఇంటికి వచ్చారంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుంది అని తులసి అంటుంది.. అవునమ్మా తులసి మన కాలనీలో మొదటిసారి దసరా సంబరాలు చేస్తున్నారట..  అందుకు మనల్ని పిలవడానికి మన ఇంటికి వచ్చారు అని అనసూయమ్మ అంటుంది.. నువ్వు ఏమంటావు అని అంటే నేను సరే అంటాను అని తులసి అంటుంది.. మరి నువ్వేమంటావు అని అనసూయమ్మ నీ పరంధామయ్య అడిగితే.. నాది ఏముంది తులసి వెనకమాల తోక ఊపుకుంటూ వెళ్లేదని అని అనసూయమ్మ చమత్కారం గా అంటుంది.. అమ్మ తులసి నీ కంటే ఈ కాలనీలో మీ అత్తయ్యకి ఎక్కువ మంది తెలుసు.. తనకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని పరంధామయ్య అంటాడు.. అవునండి ఈ కాలనీకి పెద్దదిక్కు అనసూయమ్మ గారి ఆవిడ చేతులుగా మీతో గాని ఈ సంబరాలు జరగాలి అని వాళ్లంతా అంటారు.. సరే అని ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు..!

Intinti Gruhlakshmi 07 Oct Episode : సామ్రాట్ ను బయటే నిలబెట్టిన అనసూయమ్మ..! ప్రేమ్ ను అడ్డంగా బుక్ చేసిన ఆడవాళ్ళు..!
Intinti Gruhlakshmi 07 Oct Episode : సామ్రాట్ ను బయటే నిలబెట్టిన అనసూయమ్మ..! ప్రేమ్ ను అడ్డంగా బుక్ చేసిన ఆడవాళ్ళు..!

అయితే ఈ సంబరాలన్నీ జరిపేది మీ ఆడవాళ్ళ కోసమే అని ప్రేమ్ అంటాడు.. మీ ఆడవాళ్ళందరూ మంచి మంచి చీరలు కట్టుకొని బాగా రెడీ అవుతారు అని ప్రేమ్ అంటాడు.. అయితే నువ్వు ముందు వదినకు మంచి చీర కొనపట్టాలి.. పదా షాపింగ్ కి వెళ్దామని దివ్య అంటుంది.. అదేంటి నేను మీ అందరి గురించి అంటే మీరు నన్ను అడ్డంగా బుక్ చేస్తున్నారు అని ప్రేమ అంటాడు.. మీ ఆవిడ అందంగా కనిపించొలి కదా అని దివ్య అంటుంది.. అయితే నువ్వు వదినకు సారీ కొనకూడదు అంటే వదినకి సారీ చెప్పు చాలు అని అంతా అంటారు.. ప్రేమ్ శృతికి సారీ చెప్పకుండా.. తనకి నేను సారీ కనపడటానికి షాపింగ్ తీసుకెళ్తాను రెడీ అవమని చెప్పు అని అంటాడు.. కానీ ఒక కండిషన్.. శృతిని నేను షాపింగ్ కి తీసుకువెళ్లాలంటే తను నా బైక్ వెనకమాల కూర్చొని నన్ను గట్టిగా హగ్ చేసుకోవాలి అని అంటాడు.. ఆ మాట విని తులసి సిగ్గుపడుతుంది.. అంతేనా మరిది గారు ఇంకేమైనా కావాలని అంకిత అడుగుతుంది.. ప్రస్తుతానికి అది చాలు మిగతా కోరికలు అన్ని దారిలో చెబుతాను అని ప్రేమ అంటాడు. దానికి తులసి సిగ్గుపడి నవ్వేస్తుంది.. అయితే శృతిని రెడీ అవ్వు అని ప్రేమ్ అంటాడు.. దివ్య ఈ దసరాకి హనీ ని కూడా పిలుస్తున్నావా మామ్ అని అడుగుతుంది.. తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..

సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అన్నట్టు తులసికి సారీ చెప్పడానికి వాళ్ళింటికి వస్తాడు.. సామ్రాట్ రావడం చూసి అనసూయమ్మ ఎలాగైనా సామ్రాట్ ను ఇంట్లోకి రానివ్వకూడదు.. తులసితో మాట్లాడనివ్వకూడదు.. ఇంతకీ తులసి కోసం వచ్చాడా నా కోసం వచ్చాడా అని అనుకుంటూ బయటకు వెళ్తుంది.‌ సామ్రాట్ బాబు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు.. నేనే థాంక్యూ చెప్పడానికి మీ ఇంటికి వద్దాం అని అనుకున్నాను.. కానీ నువ్వే వచ్చావు.‌ కానీ ఒక చిన్న విషయం నాకు నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మళ్లీ ఇంకొక హెల్ప్ చేయాలి అని అనసూయమ్మ అడుగుతుంది.. ఇప్పుడే పెద్ద హెల్ప్ చేసి తులసి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది.. ఇక ఇప్పుడు ఏం అడుగుతుందో అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు.. నేను మిమ్మల్ని తులసిని ఆఫీసులో నుంచి తీసేయమన్న విషయం తులసికి ఎప్పటికీ చెప్పకూడదు అని సామ్రాట్ తో అంటుంది.. సరే అని సామ్రాట్ అంటాడు..

ఇంతకీ నా కోసమే వచ్చారా లేదంటే తులసి కోసం వచ్చారా అని అనసూయమ్మ నేరుగా సామ్రాట్ ను అడుగుతుంది.. తులసి కోసం వచ్చాను అని చెబుతాడు.. తులసి కోసమని. చెప్పగానే అనసూయమ్మ కంగారుపడుతుంది.. ఒక ఫైల్ తులసి దగ్గర ఉంది ఆ ఫైల్ తీసుకుందామని వచ్చాను అని సామ్రాట్ చెబుతాడు .. అయితే నేను ఇంట్లోకి వెళ్లి తీసుకు వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని సామ్రాట్ ను రోడ్డు మీద నిలబడుతుంది. తులసి దగ్గరికి వెళ్లి సామ్రాట్ వచ్చాడు ఏదో ఫైల్ కావాలి అంటున్నాడు.. తులసిని ఇవ్వమని అనసూయమ్మ అడుగుతుంది.. సామ్రాట్ గారు వస్తే ఇంట్లోకి రమ్మనకుండా బయటే ఎందుకు నిల్చబెట్టారు.. అత్తయ్య అని తులసి అడుగుతుంది. ఏదో కంగారుగా ఉండడమ్మా ఆ ఫైల్ ఇదే ఇస్తే వెళ్ళిపోతాడు అని అంటుంది.. సరే అత్తయ్య అని నేనే ఈ ఫైల్స్ ఇస్తాను అని తులసి బయటకు వెళ్తుంది.. అదేంటి సామ్రాట్ గారు బయటే నిలబడిపోయారు.. ఫైల్స్ కోసం వచ్చారా నిజంగా అని అడుగుతుంది.. నా దగ్గర ఉన్న ఫైల్స్ మీకు అంత ఇంపార్టెంట్ వి కావు కదా అని తులసి అంటుంది.. సామ్రాట్ ఏం చెప్పాలా అని ఆలోచనలో పడతాడు..