Intinti Gruhalakshmi 22 Oct Episode : ఒకే గొడుగు కింద సామ్రాట్, తులసి.. అనసూయమ్మకి ఎక్కేస్తున్న లాస్య, నందు..!

Intinti Gruhalakshmi 22 Oct Episode :  సామ్రాట్ గారికి ఈ ఇంట్లో గొడవకి ఏ సంబంధం లేదు మర్యాదగా.. తనను బయటకు వెళ్ళమని చెప్పు.. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని నందు తులసితో అంటాడు‌.. ఆ మాటలకు సామ్రాట్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా.. సామ్రాట్ గారు ఆగండి.. మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు అని తులసి అడుగుతుంది.. మీకోసమే అని సామ్రాట్ అంటాడు.. నేను మా ఇంట్లో నుంచి మిమ్మల్ని 

వెళ్ళిపోమని చెప్పానా.. లేదు కదా.. అలాంటప్పుడు మీరు వెళ్ళిపోతే.. నాకు అవమానం చేసినట్లే కదా అని తులసి అంటుంది.. మీరు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు.. మీరు ఇక్కడే ఉండండి అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi 22 Oct today full Episode
Intinti Gruhalakshmi 22 Oct today full Episode

రేపు సామ్రాట్ గారు నేను ఇద్దరం కలిసి తన కారులో పక్కపక్కనే కూర్చుని వైజాగ్ వెళ్తున్నాము అని తులసి చెబుతుంది.. ఈ విషయాన్ని మీకు ఇప్పుడే చెబుతున్నాను. ప్రతిసారి మీరు ఇక్కడికి వచ్చి   మా ముందు నుంచుని గొంతు చించుకొని

అరవవలిసిన అవసరం లేదు.. అదేదో మెసేజ్ పెడతారు కదా.. ఆ వాయిస్ నోట్ అది పెట్టండి చాలు .. మీకు బీపీ తగ్గుతుంది. మాకు ప్రశాంతంగా ఉంటుంది.. ప్రతిసారి ఇక్కడికి వస్తే నీ మాటలు వినలేక చస్తున్నాం.. ఖాళీగా ఉన్నప్పుడు అవి వింటామని తులసి అంటుంది.. ఈ ఐడియా ఏదో బాగుంది అనసూయ.. నువ్వు కూడా ఫాలో అవ్వు అని పరంధామయ్య అంటాడు..

తులసి ముందుగా అనుకున్నట్టుగానే మంచి చీర కట్టుకొని సామ్రాట్ తో పాటు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.. అనసూయమ్మ కూడా తులసి కొత్త చీర కట్టుకుంది అని చూస్తుంది.. అప్పుడే లాస్య వాళ్ళు అక్కడికి వస్తారు.. కొత్త చీర కట్టుకున్నట్టున్నావుగా అని అంటుంది. ఒకప్పుడు మా ఆయన నాకు కొనిచ్చారు.. అప్పుడు తీరికలేదు ..ఇప్పుడు తీరిక ఉంది అందుకే కట్టుకున్నాను అని తులసి అంటుంది.. ఆ మాటలకు లాస్య షాక్ అవుతూ చూస్తుంది.. సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి కారులో వరంగల్ బయలుదేరుతారు.. అక్కడ ఆ మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు కారులో వస్తుండగా తుఫాను మొదలవుతుంది.. అనసూయమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా నందు వాళ్లందరితో తుఫాను ఉందని ముందుగానే తెలియదా ఏంటి, కావాలని తులసితో అంత దూరం వెళ్ళాడు అని నందు అంటాడు.. ఈ తుఫాన్ లో నుంచి వాళ్ళిద్దరూ ఎలా వస్తారో ఏంటో అని అనసూయమ్మ వాళ్ళు అనుకుంటుండగా.‌ మనమే ఇక్కడ కంగారుపడుతున్నాం తులసి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని నందు అంటాడు.. ఇక సామ్రాట్ తులసి ఇద్దరూ కారులో నుంచి దిగి గొడుగులో నడుచుకుంటూ రోడ్డు దాటుతూ ఉంటారు.. మిగతా విషయాలు  తర్వాత భాగంలో చూద్దాం..