Guppedanta Manasu 11 oct Episode : రిషి వండర్ చేశాడు.. జగతికి కాఫీ ఇచ్చి ఆ విషయాలు మాట్లాడాడు.. దేవయానితో రిషిని వదలనన్న వసుధర..

Guppedanta Manasu 11 oct Episode : దేవయాని వసుధరతో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. మా మేడం కోసం వచ్చాను అని అంటుంది. గురుదక్షిణ విషయంలో జరిగిన గొడవ గురించి మీరు మాట్లాడుతున్నారా అని వసుధారా ఉంటుంది.. అలాంటివి రిషి సార్ కి నాకు మధ్య ఇంకా పెద్దపెద్ద గొడవలే జరగాయి మేడం.. కానీ మేమిద్దరం ఆరోగ్యకరమైన ఒప్పందం చేసుకున్నాము.. అసలు నువ్వు రిషిని వదిలిపెట్టవా అని దేవయాని అడుగుతుంది.. నేను జీవితాంతం వదిలిపెట్టను అని వసుధర అంటుంది.. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు.. నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను అని దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

వసుధరను గౌతమ్ డ్రాప్ చేస్తాడు. ఏంటి వసుధర ఏం మాట్లాడవు అని గౌతమ్ అంటాడు.. నాకు ఈ సైలెన్స్ వద్దు వసుధర అంటాడు.. పొద్దున వచ్చేటప్పుడు రిషి సార్ నన్ను తీసుకు వచ్చారు.. ఇప్పుడు మీరు డ్రప్ చేస్తున్నారు అని వసుధర అంటుంది. రిషి అంతే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు.. నీకు తెలుసుగా వసుధర అని గౌతమ్ అంటాడు..

జగతి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహేంద్ర కాఫీ స్మైల్ వస్తుంది.. నాకోసం కాఫీ తీసుకు వస్తున్నావా.. అనవసరంగా నిన్ను శ్రమ పడుతున్నాను అని అంటూ జగతి కళ్ళు తెరుస్తుంది.. చూస్తే ఎదురుగా రిషి కాఫీ కప్పుతో కనిపిస్తాడు.. రిషి అంటూ జగతి పైకి లేకపోతే కాఫీ కప్పు ఇస్తాడు నువ్వేంటి నాకోసం కాఫీ తాగటం అని అంటుంది. ఆడ మగ అందరూ సమానమే ఈ పని ఈ వీళ్ళు చేయకూడదు.. అని రూల్ ఏం లేదు.. కదా నేను డాడ్ తో మీ ఆరోగ్యం గురించి మాట్లాడను డాడ్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. డాడ్ నీ ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నాయనీ ఆలోచించండి..

guppedanta-manasu-11-oct-today full episode
guppedanta-manasu-11-oct-today full episode

మేడం మీరు ఒక విషయం గురించి ఆలోచించండి. మీరు ఆలోచించే దానిలో అది ఎంతవరకు జరుగుతుంది.. అనేది మీకే తెలుసు నిజం చెప్పాలంటే.. మీరు బాధపడే విషయంలో మీ బాధకి మీరే కారణం.. ఒక పిలుపు కోసం ఒక బంధం బలి పెట్టాలని ఎప్పుడూ అనుకోకండి.. ఒక పిలుపు మీ దృష్టిలో బంధం కావచ్చు కానీ ఆ పిలుపు నా దృష్టిలో ఎప్పుడో దూరమైంది.. ఆ బంధం ఎప్పుడో నన్ను ఒంటరి వాడిని చేసింది.. మీరు పోగొట్టుకున్న పిలుపు కోసం మీరు ఎదురు చూడటం తప్పు మేడం అని రిషి అంటాడు.. మీరు పోగొట్టుకున్న పిలుపు విలువ ఎంతో మీకు తెలుసా? నేను కోల్పోయిన నా బాల్యం విలువ.. మేడం మీకు కావలసిన ప్రశాంతతను నేను మీకు ఇవ్వగలను.. కానీ మీరు నేను కోల్పోయిన బాల్యాన్ని తీసుకువచ్చి ఇవ్వగలరా.. రిషి నువ్వు అనుకున్నట్టుగా నేను అని జగతి అంటుంది.. చూడండి మేడం చిన్నప్పుడే నన్ను కొందరు వదిలేసి వెళ్లిపోయాక ..వసుధార వచ్చాక జీవితం అంటే ఏంటి.. బ్రతకడం అంటే ఏంటి అని తెలుసుకున్నాను..

ఇప్పుడు ఆ ఒక్క పిలుపు కోసం వసుధరతో ఆ బంధాన్ని దూరం చేయకండి. నేను మాట్లాడే మాటలు కట్టుగా ఉండవచ్చు కానీ అందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు.. మీరు లేనప్పుడు డాడ్ ఒంటరిగా ఉన్నారు.. ఇప్పుడు డాడ్ సంతోషంగా ఉన్నారు. దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయద్దు అని రిషి అంటున్న మాటలు మహీంద్రా వింటాడు..