Guppedanta Manasu 07 oct Episode : రిషి చేత జగతి మేడంని అమ్మ అని పిలిపిస్తానన్న వసుధర..!

Guppedanta Manasu 07 oct Episode : వసుధర అన్న మాటలను తలుచుకుని రిషి అక్కడి నుంచి కోపంగా నడుచుకుంటూ వస్తాడు.. అప్పుడే గౌతమ్ వచ్చి కార్ లో రిషి ని ఎక్కమని అడుగుతాడు.. నువ్వేంటి ఇక్కడ అని గౌతమ్ ను రిషి అడుగుతాడు.. అవన్నీ తర్వాత చెప్తాను ముందు కారులో ఎక్కువ అని గౌతమ్ అంటాడు.. సడన్ గా గౌతమ్ కి వసుధరావు కాల్ చేస్తుంది. మేము కారులో ఎక్కాం అని అంటుండగా కోపం చేతిలో ఫోన్ తీసుకొని హలో అని రిషి అంటాడు.. సర్ అది అని వసుధారా అంటుండగా.. ఏంటిది వసుధార అని కాల్ కట్ చేస్తాడు రిషి.. అసలు ఏమైందిరా నువ్వేం చేస్తున్నావ్ అని రిషిని గౌతమ్ అడుగుతాడు. నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కారు నడుపు అని అంటాడు.. 365 రోజులు వీడికి కోపం ఏనా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు.. ఏంటి అని రిషి కోపంగా అనగానే.. ఏం లేదు స్వామి నువ్వు కానీ అని అంటాడు..

డాడ్ నేను వసుధారతో బంధం వదులుకోవాలని అనుకోవడం లేదు.. కానీ తనే అని రిషి చెప్పబోతుండగా.. మీకు నాకు మధ్య మేడం వచ్చింది అని రిషి అంటాడు..నీకు నాకు మధ్య వసుధర వచ్చింది అని మహీంద్రా అంటాడు.. మన ఆలోచనలో పరిణితి రావాలి అని మహీంద్రా అంటాడు.. ప్లీజ్ డాడ్ మీరు ఏమి మాట్లాడకండి.. నన్ను కాసేపు మీ ఒడిలో సేద తిరనివ్వండి అని రిషి మహీంద్రా ఒడిలో నిద్రపోతాడు..

Guppedanta manasu 07 oct full episode
Guppedanta manasu 07 oct full episode

వసుధర తను పెయింట్ చేసిన బొమ్మలను రిషి చూపిస్తుంది.. ఆ బొమ్మలను చూస్తూ రాజు రాణి బొమ్మలు రెండు పక్క పక్కనే ఉండాలి అని వసుధారా అంటుంది. మరి అయితే సైన్యం ఏది అని రిషి అడుగుతారు.. మీరే నా సైన్యం ని చూస్తూ వసుధర అంటుంది.. వసుధర మన ఇద్దరి మధ్య ఒక అడ్డుతెర ఉంది.. దానిని నువ్వు తొలగిస్తావని నేను చూస్తున్నాను.. ఆ విషయంలో నువ్వేమి మాట్లాడడం లేదు అని రిషి అడుగుతాడు.. నా ఆలోచన మీకు తప్పు అని అనిపించొచ్చు కానీ కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది సర్ వసుధర చెబుతుంది.. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.. కానీ నా వైపు నుంచి ఎందుకు ఆలోచించడం లేదు.. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఎందుకు ఇంత ముందు పట్టు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు..

సార్ మీరు ఇప్పటివరకు మేడం సర్ విషయంలో ఎన్నో మెట్లు దిగారు అంటుండగా.. వసుధారా అని రిషి కోపంగా అరుస్తాడు.. నేను బంధానికి విలువ ఇస్తున్నాను. ప్రేమకు విలువ ఇస్తున్నాను. మీరు నా ప్రేమకు విలువ ఇస్తున్నాను నేను మీ తల్లి ప్రేమకు విలువ ఇస్తున్నాను అని వసుధర అంటుంది.. మీరు అమ్మని అమ్మ అని పిలవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారని వసుధర అడుగుతుంది వసుధర నేను చెప్పాల్సింది నేను చెప్పాను అని రిషి అంటాడు. సార్ మీరు ఎప్పటికైనా జగతి మేడంని అమ్మా అని పిలవాలి.. అలా పిలిచెలా చేస్తాను అని వసుధరా మనసులో అనుకుంటుంది..

సార్ నా పర్మిషన్ లేకుండా నా వీడియో ఎప్పుడు తీశారు సర్ అని వసుధర అడుగుతుంది నువ్వు నా పర్మిషన్ లేకుండా నా చైర్ లో కూర్చోవచ్చు కానీ.. నేను వీడియో తీస్తే తప్ప అని రిషి అంటాడు.. నా క్యాబిన్ ని వీడియో తీశాను అందులో నువ్వు ఉన్నావు కాబట్టి పడ్డావు.. నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నా వసుధార అని రిషి అంటాడు..