Pawan Kalyan: పొత్తులపై పవన్ ధీమా ఏమిటో ?

Pawan Kalyan:  రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. జనసేన నేతల విస్తృతస్ధాయి సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయం బాగా వేడెక్కిపోయింది. మిత్రపక్షంతో సంప్రదించకుండానే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి డైరెక్టుగా తగిలేట్లుగా మూడు ఆప్షన్లంటు పవన్ చేసిన ప్రకటనపై పై మూడుపార్టీల్లోను ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోతోంది. మూడు ఆప్షన్లు అమలులో ఎంతవరకు వర్కవుటవుతుందో తెలీదుకానీ గందరగోళం సృష్టించేందుకు మాత్రం ఉపయోగపడుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటివరకు పొత్తు విషయంలో పవన్ కు లవ్ ప్రపోజల్ పంపుతున్న చంద్రబాబునాయుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు యూటర్న్ తీసుకోవటం పవన్ అహాన్ని రెచ్చగొట్టినట్లయ్యింది. అందుకనే మూడు ఆప్షన్లంటు ప్రకటించారు. మూడు ఆప్షన్లు ఏమిటంటే మొదటిది బీజేపీ-జనసేన మాత్రమే కంటిన్యు అవటం. రెండో ఆప్షన్ ఏమిటంటే తమతో పాటు టీడీపీని కూడా కలుపుకోవటం. మూడోదేమిటంటే జనసేన ఒంటరిగా వెళ్ళటం.

నిజానికి మూడు ఆప్షన్లలో ఏది వర్కవుటైనా, కాకపోయినా పవన్ కు వచ్చే నష్టంఏమీలేదు. ఎందుకంటే 2019లో ఈ రెండుపార్టీలు లేకుండానే జనసేన పోటీచేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే మళ్ళీ ఇంకోసారి ఒంటరిపోరు విషయంలో పవన్ ధీమాగా ఉన్నారు. నిజానికి జనసేన ఒంటరిగా పోటీచేస్తేనే పవన్ దమ్ము ఏమిటో బయటపడుతుంది. ఒంటరిగా పోటీచేస్తే జనసేన అధికారంలోకి రాకపోవచ్చు. కానీ క్షేత్రస్ధాయిలో పవన్ కెపాసిటి ఏమిటన్న విషయంలో ఒక క్లారిటి వస్తుంది. ఇదే సమయంలో పవన్ గనుక ఒంటరిగా పోటీచేస్తే ఇటు బీజేపీ అటు చంద్రబాబు కెపాసిటి కూడా తేలిపోతుంది.

బాదుడే బాదుడు, మహానాడు నిర్వహణ తర్వాత చంద్రబాబు, తమ్ముళ్ళల్లో వచ్చిన వైఖరి వల్లే పవన్ మూడు ఆప్షన్ల నిర్ణయం తీసుకున్నట్లున్నారు. పై కార్యక్రమాల నిర్వహణ ముందువరకు పొత్తుపై పవన్ జపం చేసిన చంద్రబాబు వైఖరిలో తర్వాత మాత్రం కొట్టొచ్చిన తేడా కనబడింది. అందుకనే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్ష గెలుపని, వార్ వన్ సైడే అంటు నోటికొచ్చింది మాట్లాడారు. అప్పటినుండే పవన్ను తీసిపారేసినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో పవన్ అహం దెబ్బతిన్నట్లుంది.


పొత్తుపై చంద్రబాబు ప్రతిపాదన తర్వాతే పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేదిలేదని చాలెంజులు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు తీసుకున్న యూటర్న్ తో పవన్లో మొదట ఆశ్చర్యం తర్వాత మంట మొదలైనట్లుంది. అందుకనే మూడు ఆప్షన్లు ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. నిజంగానే పవన్ గనుక ఒంటరిగా పోటీచేస్తే ముందు దెబ్బపడేది టీడీపీపైనే అన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. అదేగనుక జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావటంఖాయం. అప్పుడు తెలంగాణాలో ఏమైందో టీడీపీ పరిస్ధితి ఏపీలో కూడా సేమ్ టు సేమ్. అందుకనే ఇపుడు చంద్రబాబులో కలవరం మొదలై పొత్తుపై ఎవరు నోరెత్తదని ఆదేశాలు జారీచేశారట. చూద్దాం చివరకు ఏమవుతుందో.